*టెట్ విషయంలో ఉపాధ్యాయుల ప్రయోజనం పరిగణలోకి తీసుకోవాలి*
*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జాయింట్ సెక్రెటరీ ప్రభుత్వానికి డిమాండ్*
*పున్నమి ప్రతినిధి 20 /12/ 2025*
*🍥రాష్ట్రంలో జనవరి 3 నుంచి 20 నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను వాయిదా వేయాలని అలాగే పేపర్ 3 హిందీ తెలుగు భాషలకు సంబంధించిన వారికి ప్రత్యేకంగా నిర్వహిస్తే వారికి శాస్త్రీయంగా ఉంటుందని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట జాయింట్ సెక్రెటరీ ఎండి అమీర్ పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఇరవై రోజులుగా రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయక ప్రిసైడింగ్ అధికారులుగా బాధ్యతను నిర్వర్తించారని,దాని వల్ల టెట్ పరీక్షకు సన్నద్ధమవ్వడానికి తగిన సమయం వారికి లభించలేదని పేర్కొన్నారు. టెట్ పరీక్షకు సిద్ధమవ్వడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని, అందుకే జనవరి నెలలో జరగనున్న ఈ పరీక్షను వాయిదా వేయాలని వేసవి సెలవుల్లో నిర్వహిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా, సానుకూలంగా ఉంటుందని కోరారు.*


