ఏర్పేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణం మరోమారు సాంకేతిక, సాంస్కృతిక వేడుకలకు వేదిక కానుంది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ పర్యవేక్షణలో విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తిరుత్సవ-2026’ టెక్నో-కల్చరల్ ఈవెంట్ నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకల ప్రారంభోత్సవానికి సినీ గ్లామర్ తోడు కానుంది. జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్, ‘డెకాయిట్’ సినిమా హీరో అడివి శేష్, ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ఈవెంట్ లో మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘డెకాయిట్’ చిత్రం నుండి మొదటి సాంగ్ ను ఐఐటీ విద్యార్థుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు సంబంధించి విద్యార్థులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ‘తిరుత్సవ-2026’లో వివిధ దేశాల, రాష్ట్రాల నుండి వచ్చే విద్యార్థుల కోసం సాంకేతిక పోటీలు, వర్క్‌షాప్‌లు, కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

టెక్నో వేడుకకు సినీ గ్లామర్.. నేడు ఐఐటీలో ‘డెకాయిట్’ టీమ్ సందడి