*టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబుకు ఘన సన్మానం*
మంథని/హైదరాబాద్, జులై 28, పున్నమి ప్రతినిధి: సికింద్రాబాద్‌లోని స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబును ఆదివారం బ్రాహ్మిణ్ వెల్ఫేర్ ట్రస్ట్, బ్రాహ్మిణ్ అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు బ్రాహ్మిణ్ సంఘ నాయకులు, ప్రముఖులు పాల్గొని దుద్దిళ్ళ శ్రీను బాబు సేవా పరమతను ప్రశంసించారు. ఆయన సామాజిక సేవ, ప్రజా సమస్యలపై పట్టుదల, రాజకీయాల్లో విశ్వసనీయతకు గుర్తింపుగా ఆత్మీయ సత్కారం చేసినట్లు పేర్కొన్నారు.
ఇదే క్రమంలో ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించబడినాయి. కార్యక్రమం ముగింపు సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.