Story highlights
- పామూరు: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కుటుంబ సాధికారిక సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పామూరు మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు పిలుపునిచ్చారు.
- ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పామూరు పట్టణంలోని శేషమహల్ ప్రాంగణంలో రెండో ఎంపీటీసీ ప్రాదేశిక పరిధి, 5, 6, 7, 8 వార్డులకు చెందిన కుటుంబ సాధికారిక సభ్యుల సమావేశం నిర్వహించారు.
- ఈ సందర్భంగా బొల్లా నరసింహారావు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
పామూరు: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కుటుంబ సాధికారిక సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పామూరు మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు పిలుపునిచ్చారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పామూరు పట్టణంలోని శేషమహల్ ప్రాంగణంలో రెండో ఎంపీటీసీ ప్రాదేశిక పరిధి, 5, 6, 7, 8 వార్డులకు చెందిన కుటుంబ సాధికారిక సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లా నరసింహారావు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు నాయకుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ విజయానికి కుటుంబ సాధికారిక సభ్యుల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలపర్తి వెంకటేశ్వర్లు, మాజీ పట్టణ సర్పంచ్ సోమిశెట్టి వెంకటనారాయణ, మాజీ పట్టణ ఉప సర్పంచ్ యాదల సాయికిరణ్, క్లస్టర్ ఇన్చార్జులు ఆడుసుమల్లి ప్రభాకర్రావు, గుంటుపల్లి శ్రీనివాసులు, సింగిల్ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు, మాజీ సింగిల్ విండో చైర్మన్ బైరెడ్డి జయరామిరెడ్డి, బీజేపీ నాయకులు కొండిశెట్టి రమణయ్య, ఇమ్మడిశెట్టి శ్రీను, జనసేన నాయకులు వై. రహీముల్లా, దర్శి ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆకుపాటి వెంకటేష్, వార్డు ఇన్చార్జులు నీరుకట్టు రసూల్, గడ్డం తేజ, నర్సింగ్ సాంబశివరావు, ఈర్ల సత్యంతో పాటు మండల, పట్టణ టీడీపీ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కుటుంబ సాధికారిక సభ్యులు పాల్గొన్నారు.