Wednesday, 11 February 2026
  • Home  
  • టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది
- విశాఖపట్నం

టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* – టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది – మహిళా సంక్షేమశాఖ మంత్రి పీఏ మహిళా ఉద్యోగిపై వేధింపులా? – ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు – న్యాయం చేయాలని మంత్రిని ఆశ్రయిస్తే బదిలీ బహుమానం – మంత్రి సంధ్యారాణి తన పీఏను సమర్ధించడం సిగ్గుచేటు : తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదుకళ్యాణి విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. – ఉద్యోగం కోసం పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్న మంత్రి పీఏ – అడిగితే టీడీపీ నేతల పక్కలోకి రావాలంటూ వేధింపులు – ఇది సిగ్గుమాలిన ప్రభుత్వం – మహిళలను వేధిస్తే అదే ఆఖరి రోజు కావాలన్న సీఎం చంద్రబాబు – మీ కేబినెట్ మంత్రి పీఏ పై చర్యలేవీ? : చంద్రబాబుని నిలదీసిన వరుదు కల్యాణి – ఆడపిల్లలను వేధిస్తే తాటతీస్తామన్న పవన్ కళ్యాణ్ గారూ – మీ సహచర మంత్రి తాట ఎప్పుడు తీస్తారు? – ఆమె పీఏ తాట ఎప్పుడు తీస్తారు? : డిప్యూటీ సీఎం పవన్ ను ప్రశ్నించిన వరుదు కళ్యాణి – వేధింపులకు పాల్పడ్డ మంత్రి పీఏను అరెస్టు చేయాలి – మంత్రి సంధ్యారాణిని కేబినెట్ నుంచి భర్తరప్ చేయాలి : వరుదు కల్యాణి డిమాండ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ అధికార పార్టీ నేతలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారిందని ఆమె మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… మహిళా సంక్షేమశాఖ మంత్రి పీఏ ఏకంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగిని వేధిస్తే.. పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు సరికదా… న్యాయం చేయాలని మంత్రిని ఆశ్రయిస్తే బదిలీ బహుమానంగా ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఉద్యోగం కోసం పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్న మంత్రి పీఏ.. డబ్బులు అడిగితే టీడీపీ నేతల పక్కలోకి రావాలని వేధించం దారుణమన్నారు. మహిళలను వేధిస్తే అదే ఆఖరి రోజు కావాలన్న సీఎం చంద్రబాబు మహిళా ఉద్యోగిని వేధిస్తున్న తన కేబినెట్ మంత్రి పీఏను తక్షణమే అరెస్టు చేయడంతో పాటు మంత్రి సంధ్యారాణిని కేబినెట్ నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ● సంధ్యారాణి- మహిళా వేధింపుల శాఖా మంత్రి… సాక్షాత్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీఏ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు దిగడం అత్యంత దుర్మార్గం.. అధికార తెలుగుదేశం పార్టీ దండుపాళ్యం బ్యాచ్ గా మారిందనడానికి ఇదే నిదర్శనం. రాష్ట్రంలో ఉన్న దుర్మార్గమైన పరిస్థితులుకు ఇదే నిదర్శనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు సరికదా… ఆ రక్షణ లేకుండా చేస్తున్నది, వేధిస్తున్నది కూడా అధికార పార్టీ నేతలే అన్నదానికి మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ ఉదంతమే నిదర్శనం.తనకు జరుగుతున్న అన్యాయంపై సాక్షాత్తూ మంత్రికే ఫిర్యాదు చేస్తే… బాధితురాలికి అండగా నిలబడాల్సింది పోయి తన పీఏకే వత్తాసు పలుకుతూ సభ్యసమాజాం సిగ్గుపడేలా వ్యవహరించారు. ఒక మహిళగా, స్త్రీశిశు సంక్షేమశాఖా మంత్రిగా సాటి మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి తన పీఏను వెనకేసుకుని రావడం సిగ్గుచేటు. మంత్రి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమశాఖా మంత్రా? లేక స్త్రీల వేధింపుల శాఖ మంత్రా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ పూర్తిగా దిగజారిపోయాయి. ● న్యాయం అడిగితే పక్కలోకి రమ్మంటున్న టీడీపీ నేతలు… మంత్రి సంధ్యారాణి పీఏ… బాధిత మహిళ దగ్గర డబ్బులు తీసుకోవడంతో పాటు, ఆమెను పక్కలోకి రావాలని వేధింపులకు గురిచేయడంతో పాటు మరింత బరితెగించి ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కలోకి కూడా రావాలని ఒత్తిడి చేయడం అత్యంత అమానుషం. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. మంత్రి గారి పీఏ కు మంత్రి అండ ఉంది కాబట్టి వారు పట్టించుకోలేదు. గత్యంతరం లేక నేరుగా మంత్రికే బాధితురాలు ఫిర్యాదు చేస్తే.. ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి బాధిత మహిళపై కక్ష సాధింపు ధోరణిలో రూరల్ ప్రాంతానికి బదిలీ చేశారు. ఇది మంత్రి సిగ్గుపడాల్సిన విషయం. ఇదేమి సంస్కారం మంత్రిగారూ? మీ పీఏ వేధింపులకు తలొగ్గకపోతే సాలూరు నుంచి ఏకంగా గుమ్మలక్ష్మీపురం బదిలీ చేస్తారా? మీ వేధింపులపై సాక్ష్యాలతో సహా బాధితురాలు చెబుతుంటే ఆమెకు కనీస రక్షణ కల్పించలేని అసమర్థ ప్రభుత్వమిది. పోలీసులు, మంత్రి సంధ్యారాణి పట్టించుకోకపోవడంతో మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేసినా కూడా నిందితుడు సతీష్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. పైగా బాధిత మహిళలనే తిరిగి వేధిస్తున్న దుస్థితి. ● కూటమి ప్రభుత్వంలో మహిళా రక్షణ గాల్లో దీపం… కూటమి ప్రభుత్వంలో మహిళల మాన, ప్రాణాలు గాల్లో దీపాల్లా తయారయ్యాయి. అయినా మహిళల రక్షణ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యంతో ఉంది. మహిళలను ఎవరైనా వేధిస్తే… వారికి అదే చివరి రోజు అని చెప్పే సీఎం చంద్రబాబు.. తన కేబినెట్ లో మహిళా మంత్రి పీఎ వేధింపులకు గురైన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఆ పీఏను తక్షణమే అరెస్టు చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి లేదా చంద్రబాబుగారూ? పీఏ వేధింపులకు కొమ్ముకాస్తూ.. బాధితురాలు ఆవేనను పట్టించుకోని మీ మహిళా మంత్రిని కేబినెట్ నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలి. మహిళలను వేధిస్తే.. తాటతీస్తానంటూ ఆవేశంగా డైలాగులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… మీ సహచర మంత్రి మహిళలను వేధిస్తుంటే మీరు ఎవరు తాట తీశారు? మీ సహచర మంత్రి తాట ఎప్పుడు తీస్తారు? ఆమె పీఏ తాట ఎప్పుడు తీస్తారు? మహిళల గౌరవం గురించి గొప్పగా ట్వీట్లు చేసే మంత్రి లోకేష్ గారు.. .బాధిత మహిళ తన రక్షణ కోసం మిమ్మల్ని కూడా ఆశ్రయించింది. అయినా మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు మాటలకు మాత్రమే పరిమతం అవుతారా? మహిళల రక్షణ మీకు పట్టదా? ప్రభుత్వ మహిళా ఉద్యోగి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే.. హోంమంత్రి ఎందుకు కనీస చర్యలు తీసులేదు? మీరు మాటలు తప్ప.. మహిళల రక్షణ ఎప్పుడో గాలికొదిలేశారని మరోసారి నిరూపితమైంది. మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మంత్రి సంధ్యారాణి పీఏను అరెస్టు చేయాలి. మరోవైపు బాధిత మహిళ ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళలకు రక్షణ కల్పించారు. ● కూటమి పాలన- దిగజారిన శాంతిభద్రతలు… కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత… శాంతిభద్రతల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ 36వ స్ధానానికి దిగజారిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద రోజుకు 70-80 ఘటనలు నమోదు కాగా…. గంటకు 3-4 సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మహిళల మీద నేరాలు 4శాతం, మహిళల మీద రేప్ లు 9శాతం, గంజాయి, డ్రగ్స్, మద్యం వినియోగం 31 శాతం పెరిగింది. ఇంత దారుణమైన సంఘటలు చూస్తున్నాం. బీఎన్ఎస్ యాక్ట్, బీ ఎస్ ఎస్ ఎస్ యాక్ట్ ఏ రాష్ట్రాల్లో పక్కాగా అమలు చేస్తున్నారన్న దానిపై సర్వే చేస్తే మన రాష్ట్రం చిట్టచివరి 36 స్ధానంలో ఉంది. ఒక బాధితుడు పీఎస్ లో ఫిర్యాదు చేస్తే.. ఎంతవరకు అఫ్ లోడ్ చేస్తున్నారు, సీన్ ఆఫ్ అఫెన్స్ ని ఎంత వేగంగా అప్ లోడ్ చేస్తున్నారన్నదాన్ని పరిశీలిస్తే.. అది మన రాష్ట్రంలో ఆ డేటాను అప్ లోడ్ చేయడం లేదు . దీనికి కారణం అక్రమ కేసులు, తప్పుడు కేసులే కారణం. డేటా వెంటనే అప్ లోడ్ చేస్తే అక్రమ కేసులు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి… ఆ పని చేయడం లేదు. ఫలితంగా మన శాంతిభద్రతల నిర్వహణలో 36వ స్ధానానికి దిగజారిపోయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ప్రతి ఘటనలోనూ టీడీపీ నేతల హస్తం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కూడా కల్పించలేకపోయారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం, డ్రగ్స్ ఏరులై పారుతున్నాయి. ఏ కేబినెట్ మీటింగ్ లోనూ మహిళల రక్షణ గురించి చర్చించిన పాపాన పోలేదు. ● వైయస్.జగన్ ప్రభుత్వం- మహిళా రక్షణకు పెద్ద పీట గతంలో వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో దిశయాప్ ద్వారా 1.30 కోట్ల మంది మహిళలు దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని.. పెద్ద సంఖ్యలో ఉపయోగించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కాపీ కొడుతూ.. శక్తి యాప్ అని తీసుకొచ్చారు. మంత్రి పీఏ వేధింపులపై నేరుగా పోలీస్ స్టేషన్ కు, మంత్రులు సంధ్యారాణి, లోకేష్ లకు ఫిర్యాదు చేసినా స్పందించకపోతే…శక్తి యాప్ ఏం చేస్తుంది.? వైయస్.జగన్ హయాంలో దిశ యాప్ ద్వారా వేలసంఖ్యలో మహిళలు రక్షణ పొందారు. దిశ యాప్ ను చట్టం చేయడం కోసం అసెంబ్లీలో ఆమోదించి.. దాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపించారు. కేంద్రం ఆమోదించేలోగా.. దిశ లోని అంశాలన్నీ అమలు చేశారు. మహిళలకు పెద్ద పీట వేశారు. ప్రతి నెలా మహిళా భద్రతపై సమీక్ష నిర్వహిస్తూ. .వారి భద్రత కోసం అనేక పటిషమైన చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం మహిళల కిచ్చిన ఏ హామీలు అమలు చేయలేదు సరికదా.. వారి రక్షణను గాలికొదిలేయాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేపధ్యంలో బాధిత మహిళలకు వైయస్సార్సీపీ అండగా ఉంటుందని వరుదు కల్యాణి స్పష్టం చేశారు. తక్షణమే ఆమెను వేధించిన నిందితుడు సతీష్ ను అరెస్టు చేయడంతో పాటు మంత్రి సంధ్యారాణిని కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి , లో జిల్లా అంగన్వడి విభాగం

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*

– టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది
– మహిళా సంక్షేమశాఖ మంత్రి పీఏ మహిళా ఉద్యోగిపై వేధింపులా?
– ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
– న్యాయం చేయాలని మంత్రిని ఆశ్రయిస్తే బదిలీ బహుమానం
– మంత్రి సంధ్యారాణి తన పీఏను సమర్ధించడం సిగ్గుచేటు
: తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదుకళ్యాణి

విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.

– ఉద్యోగం కోసం పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్న మంత్రి పీఏ
– అడిగితే టీడీపీ నేతల పక్కలోకి రావాలంటూ వేధింపులు
– ఇది సిగ్గుమాలిన ప్రభుత్వం
– మహిళలను వేధిస్తే అదే ఆఖరి రోజు కావాలన్న సీఎం చంద్రబాబు
– మీ కేబినెట్ మంత్రి పీఏ పై చర్యలేవీ?
: చంద్రబాబుని నిలదీసిన వరుదు కల్యాణి

– ఆడపిల్లలను వేధిస్తే తాటతీస్తామన్న పవన్ కళ్యాణ్ గారూ
– మీ సహచర మంత్రి తాట ఎప్పుడు తీస్తారు?
– ఆమె పీఏ తాట ఎప్పుడు తీస్తారు?
: డిప్యూటీ సీఎం పవన్ ను ప్రశ్నించిన వరుదు కళ్యాణి

– వేధింపులకు పాల్పడ్డ మంత్రి పీఏను అరెస్టు చేయాలి
– మంత్రి సంధ్యారాణిని కేబినెట్ నుంచి భర్తరప్ చేయాలి
: వరుదు కల్యాణి డిమాండ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ అధికార పార్టీ నేతలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారిందని ఆమె మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… మహిళా సంక్షేమశాఖ మంత్రి పీఏ ఏకంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగిని వేధిస్తే.. పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు సరికదా… న్యాయం చేయాలని మంత్రిని ఆశ్రయిస్తే బదిలీ బహుమానంగా ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఉద్యోగం కోసం పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్న మంత్రి పీఏ.. డబ్బులు అడిగితే టీడీపీ నేతల పక్కలోకి రావాలని వేధించం దారుణమన్నారు. మహిళలను వేధిస్తే అదే ఆఖరి రోజు కావాలన్న సీఎం చంద్రబాబు మహిళా ఉద్యోగిని వేధిస్తున్న తన కేబినెట్ మంత్రి పీఏను తక్షణమే అరెస్టు చేయడంతో పాటు మంత్రి సంధ్యారాణిని కేబినెట్ నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

● సంధ్యారాణి- మహిళా వేధింపుల శాఖా మంత్రి…

సాక్షాత్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీఏ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు దిగడం అత్యంత దుర్మార్గం.. అధికార తెలుగుదేశం పార్టీ దండుపాళ్యం బ్యాచ్ గా మారిందనడానికి ఇదే నిదర్శనం. రాష్ట్రంలో ఉన్న దుర్మార్గమైన పరిస్థితులుకు ఇదే నిదర్శనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు సరికదా… ఆ రక్షణ లేకుండా చేస్తున్నది, వేధిస్తున్నది కూడా అధికార పార్టీ నేతలే అన్నదానికి మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ ఉదంతమే నిదర్శనం.తనకు జరుగుతున్న అన్యాయంపై సాక్షాత్తూ మంత్రికే ఫిర్యాదు చేస్తే… బాధితురాలికి అండగా నిలబడాల్సింది పోయి తన పీఏకే వత్తాసు పలుకుతూ సభ్యసమాజాం సిగ్గుపడేలా వ్యవహరించారు. ఒక మహిళగా, స్త్రీశిశు సంక్షేమశాఖా మంత్రిగా సాటి మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి తన పీఏను వెనకేసుకుని రావడం సిగ్గుచేటు. మంత్రి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమశాఖా మంత్రా? లేక స్త్రీల వేధింపుల శాఖ మంత్రా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ పూర్తిగా దిగజారిపోయాయి.

● న్యాయం అడిగితే పక్కలోకి రమ్మంటున్న టీడీపీ నేతలు…

మంత్రి సంధ్యారాణి పీఏ… బాధిత మహిళ దగ్గర డబ్బులు తీసుకోవడంతో పాటు, ఆమెను పక్కలోకి రావాలని వేధింపులకు గురిచేయడంతో పాటు మరింత బరితెగించి ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కలోకి కూడా రావాలని ఒత్తిడి చేయడం అత్యంత అమానుషం. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. మంత్రి గారి పీఏ కు మంత్రి అండ ఉంది కాబట్టి వారు పట్టించుకోలేదు. గత్యంతరం లేక నేరుగా మంత్రికే బాధితురాలు ఫిర్యాదు చేస్తే.. ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి బాధిత మహిళపై కక్ష సాధింపు ధోరణిలో రూరల్ ప్రాంతానికి బదిలీ చేశారు. ఇది మంత్రి సిగ్గుపడాల్సిన విషయం. ఇదేమి సంస్కారం మంత్రిగారూ? మీ పీఏ వేధింపులకు తలొగ్గకపోతే సాలూరు నుంచి ఏకంగా గుమ్మలక్ష్మీపురం బదిలీ చేస్తారా?
మీ వేధింపులపై సాక్ష్యాలతో సహా బాధితురాలు చెబుతుంటే ఆమెకు కనీస రక్షణ కల్పించలేని అసమర్థ ప్రభుత్వమిది. పోలీసులు, మంత్రి సంధ్యారాణి పట్టించుకోకపోవడంతో మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేసినా కూడా నిందితుడు సతీష్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. పైగా బాధిత మహిళలనే తిరిగి వేధిస్తున్న దుస్థితి.

● కూటమి ప్రభుత్వంలో మహిళా రక్షణ గాల్లో దీపం…

కూటమి ప్రభుత్వంలో మహిళల మాన, ప్రాణాలు గాల్లో దీపాల్లా తయారయ్యాయి. అయినా మహిళల రక్షణ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యంతో ఉంది. మహిళలను ఎవరైనా వేధిస్తే… వారికి అదే చివరి రోజు అని చెప్పే సీఎం చంద్రబాబు.. తన కేబినెట్ లో మహిళా మంత్రి పీఎ వేధింపులకు గురైన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఆ పీఏను తక్షణమే అరెస్టు చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి లేదా చంద్రబాబుగారూ? పీఏ వేధింపులకు కొమ్ముకాస్తూ.. బాధితురాలు ఆవేనను పట్టించుకోని మీ మహిళా మంత్రిని కేబినెట్ నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలి.
మహిళలను వేధిస్తే.. తాటతీస్తానంటూ ఆవేశంగా డైలాగులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… మీ సహచర మంత్రి మహిళలను వేధిస్తుంటే మీరు ఎవరు తాట తీశారు? మీ సహచర మంత్రి తాట ఎప్పుడు తీస్తారు? ఆమె పీఏ తాట ఎప్పుడు తీస్తారు?
మహిళల గౌరవం గురించి గొప్పగా ట్వీట్లు చేసే మంత్రి లోకేష్ గారు.. .బాధిత మహిళ తన రక్షణ కోసం మిమ్మల్ని కూడా ఆశ్రయించింది. అయినా మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు మాటలకు మాత్రమే పరిమతం అవుతారా? మహిళల రక్షణ మీకు పట్టదా?
ప్రభుత్వ మహిళా ఉద్యోగి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే.. హోంమంత్రి ఎందుకు కనీస చర్యలు తీసులేదు? మీరు మాటలు తప్ప.. మహిళల రక్షణ ఎప్పుడో గాలికొదిలేశారని మరోసారి నిరూపితమైంది. మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మంత్రి సంధ్యారాణి పీఏను అరెస్టు చేయాలి. మరోవైపు బాధిత మహిళ ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళలకు రక్షణ కల్పించారు.

● కూటమి పాలన- దిగజారిన శాంతిభద్రతలు…

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత… శాంతిభద్రతల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ 36వ స్ధానానికి దిగజారిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద రోజుకు 70-80 ఘటనలు నమోదు కాగా…. గంటకు 3-4 సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మహిళల మీద నేరాలు 4శాతం, మహిళల మీద రేప్ లు 9శాతం, గంజాయి, డ్రగ్స్, మద్యం వినియోగం 31 శాతం పెరిగింది. ఇంత దారుణమైన సంఘటలు చూస్తున్నాం. బీఎన్ఎస్ యాక్ట్, బీ ఎస్ ఎస్ ఎస్ యాక్ట్ ఏ రాష్ట్రాల్లో పక్కాగా అమలు చేస్తున్నారన్న దానిపై సర్వే చేస్తే మన రాష్ట్రం చిట్టచివరి 36 స్ధానంలో ఉంది. ఒక బాధితుడు పీఎస్ లో ఫిర్యాదు చేస్తే.. ఎంతవరకు అఫ్ లోడ్ చేస్తున్నారు, సీన్ ఆఫ్ అఫెన్స్ ని ఎంత వేగంగా అప్ లోడ్ చేస్తున్నారన్నదాన్ని పరిశీలిస్తే.. అది మన రాష్ట్రంలో ఆ డేటాను అప్ లోడ్ చేయడం లేదు . దీనికి కారణం అక్రమ కేసులు, తప్పుడు కేసులే కారణం. డేటా వెంటనే అప్ లోడ్ చేస్తే అక్రమ కేసులు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి… ఆ పని చేయడం లేదు. ఫలితంగా మన శాంతిభద్రతల నిర్వహణలో 36వ స్ధానానికి దిగజారిపోయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ప్రతి ఘటనలోనూ టీడీపీ నేతల హస్తం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కూడా కల్పించలేకపోయారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం, డ్రగ్స్ ఏరులై పారుతున్నాయి. ఏ కేబినెట్ మీటింగ్ లోనూ మహిళల రక్షణ గురించి చర్చించిన పాపాన పోలేదు.

● వైయస్.జగన్ ప్రభుత్వం- మహిళా రక్షణకు పెద్ద పీట

గతంలో వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో దిశయాప్ ద్వారా 1.30 కోట్ల మంది మహిళలు దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని.. పెద్ద సంఖ్యలో ఉపయోగించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కాపీ కొడుతూ.. శక్తి యాప్ అని తీసుకొచ్చారు. మంత్రి పీఏ వేధింపులపై నేరుగా పోలీస్ స్టేషన్ కు, మంత్రులు సంధ్యారాణి, లోకేష్ లకు ఫిర్యాదు చేసినా స్పందించకపోతే…శక్తి యాప్ ఏం చేస్తుంది.?
వైయస్.జగన్ హయాంలో దిశ యాప్ ద్వారా వేలసంఖ్యలో మహిళలు రక్షణ పొందారు. దిశ యాప్ ను చట్టం చేయడం కోసం అసెంబ్లీలో ఆమోదించి.. దాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపించారు. కేంద్రం ఆమోదించేలోగా.. దిశ లోని అంశాలన్నీ అమలు చేశారు. మహిళలకు పెద్ద పీట వేశారు. ప్రతి నెలా మహిళా భద్రతపై సమీక్ష నిర్వహిస్తూ. .వారి భద్రత కోసం అనేక పటిషమైన చర్యలు తీసుకున్నారు.

కూటమి ప్రభుత్వం మహిళల కిచ్చిన ఏ హామీలు అమలు చేయలేదు సరికదా.. వారి రక్షణను గాలికొదిలేయాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేపధ్యంలో బాధిత మహిళలకు వైయస్సార్సీపీ అండగా ఉంటుందని వరుదు కల్యాణి స్పష్టం చేశారు. తక్షణమే ఆమెను వేధించిన నిందితుడు సతీష్ ను అరెస్టు చేయడంతో పాటు మంత్రి సంధ్యారాణిని కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశం లో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి , లో జిల్లా అంగన్వడి విభాగం అధ్యక్షురాలు పెనుమత్స శ్రీదేవి వర్మ , ఉపాధ్యక్షురాలు పార్వతి , నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష పాల్గొన్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.