మనుబోలు 24-05-2020( పున్నమి ప్రతినిధి) తిరుమల దేవాలయ ఆస్తుల అమ్మకం సరికాదు బిజెపి నాయకుడు బోలా శ్రీనివాసులు
తిరుమల దేవాలయానికి ఇతర రాష్ట్రాలలో స్థలాలు, భక్తులు కొంత మంది, తమ ఆస్తులు పరుల పాలు చేయడం ఇష్టం లేక, వాళ్ళ ఇళ్ళనో, భవన సముదాయాలనో, ఖాళీ స్థలాలనో ఆ కలియుగ దైవం (టీటీడీ) పేర వ్రాసేసి ఆ దస్తావేజులను తెచ్చి స్వామికి సమర్పిస్తుంటారు. అలాగే కొంత మంది భక్తులు తమ తమ వ్యాపారాలలో బాగా కలిసివచ్చిందన్న సంతోషంతో, కొంత ఆస్తిని స్వామి వారికి సమర్పిస్తుంటారు.
భక్తులచేత సమర్పించబడిన ఆస్తులు కొన్నిటిని టీటీడీ వేలం ద్వారా అమ్మేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది అన్న వార్తలు వస్తున్నాయి. దానికి ప్రభుత్వం చెప్తున్న సాకు ఏంటంటే, “అవి టీటీడీ కి భారంగా మారాయి కాబట్టి, వాటిని వదిలించుకోవడానికి వేలం వేస్తున్నాము”. ఇది చాలా దారుణమైన విషయం. అసలు ఈ భూప్రపంచంలో స్థలాలు, భవనాలు భారంగా మారే అవకాశం ఉందా – అది కూడా టీటీడీ లాంటి విస్తృత నెట్ వర్క్ ఉన్న ఒక అతి పెద్ద ధార్మిక వ్యవస్థకి. రియల్ ఎస్టేట్ గా మనం పిలుచుకుంటోంది వాటినే కదా.
స్వామి వారి మీద అత్యంత విశ్వాసంతో భక్తులు ఇచ్చిన ఆస్తులను భారమయ్యాయి అన్న సాకుతో డబ్బు చేసుకోవడం శోచనీయం. సక్రమంగా నిర్వహిస్తే అవి ఏ విధంగానూ టీటీడీ కి భారమయ్యే ప్రసక్తే లేదు. ఒక వేళ నిజంగానే వాటిని నిర్వహించడం టీటీడీకి కుదరని పక్షంలో, ఆ ప్రాంతం లో ఉన్న ఏదన్నా దేవాలయానికి వాటిని అప్పచెప్పాలి కానీ, అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు.
ఇప్పటికే పవిత్ర పుణ్య క్షేత్రంగా వెలుగొందాల్సిన తిరుమల రాజకీయ జోక్యం ఎక్కువ అవడంతో, అనేక అకృత్యాలకు వేదికగా మారింది. ఏది ఏమైనా, భక్తుల విశ్వాసాన్ని, మనోభావాలను దెబ్బతీసే హక్కు ప్రభుత్వాలకి ఉండకూడదు. అది చాలా ప్రమాదకరం అని అన్నారు.
టి.టి.డి దేవాలయ ఆస్తులు అమ్మకం సరికాదు…బిజెపి నాయకుడు బోలా శ్రీనివాసులు
మనుబోలు 24-05-2020( పున్నమి ప్రతినిధి) తిరుమల దేవాలయ ఆస్తుల అమ్మకం సరికాదు బిజెపి నాయకుడు బోలా శ్రీనివాసులు తిరుమల దేవాలయానికి ఇతర రాష్ట్రాలలో స్థలాలు, భక్తులు కొంత మంది, తమ ఆస్తులు పరుల పాలు చేయడం ఇష్టం లేక, వాళ్ళ ఇళ్ళనో, భవన సముదాయాలనో, ఖాళీ స్థలాలనో ఆ కలియుగ దైవం (టీటీడీ) పేర వ్రాసేసి ఆ దస్తావేజులను తెచ్చి స్వామికి సమర్పిస్తుంటారు. అలాగే కొంత మంది భక్తులు తమ తమ వ్యాపారాలలో బాగా కలిసివచ్చిందన్న సంతోషంతో, కొంత ఆస్తిని స్వామి వారికి సమర్పిస్తుంటారు. భక్తులచేత సమర్పించబడిన ఆస్తులు కొన్నిటిని టీటీడీ వేలం ద్వారా అమ్మేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది అన్న వార్తలు వస్తున్నాయి. దానికి ప్రభుత్వం చెప్తున్న సాకు ఏంటంటే, “అవి టీటీడీ కి భారంగా మారాయి కాబట్టి, వాటిని వదిలించుకోవడానికి వేలం వేస్తున్నాము”. ఇది చాలా దారుణమైన విషయం. అసలు ఈ భూప్రపంచంలో స్థలాలు, భవనాలు భారంగా మారే అవకాశం ఉందా – అది కూడా టీటీడీ లాంటి విస్తృత నెట్ వర్క్ ఉన్న ఒక అతి పెద్ద ధార్మిక వ్యవస్థకి. రియల్ ఎస్టేట్ గా మనం పిలుచుకుంటోంది వాటినే కదా. స్వామి వారి మీద అత్యంత విశ్వాసంతో భక్తులు ఇచ్చిన ఆస్తులను భారమయ్యాయి అన్న సాకుతో డబ్బు చేసుకోవడం శోచనీయం. సక్రమంగా నిర్వహిస్తే అవి ఏ విధంగానూ టీటీడీ కి భారమయ్యే ప్రసక్తే లేదు. ఒక వేళ నిజంగానే వాటిని నిర్వహించడం టీటీడీకి కుదరని పక్షంలో, ఆ ప్రాంతం లో ఉన్న ఏదన్నా దేవాలయానికి వాటిని అప్పచెప్పాలి కానీ, అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు. ఇప్పటికే పవిత్ర పుణ్య క్షేత్రంగా వెలుగొందాల్సిన తిరుమల రాజకీయ జోక్యం ఎక్కువ అవడంతో, అనేక అకృత్యాలకు వేదికగా మారింది. ఏది ఏమైనా, భక్తుల విశ్వాసాన్ని, మనోభావాలను దెబ్బతీసే హక్కు ప్రభుత్వాలకి ఉండకూడదు. అది చాలా ప్రమాదకరం అని అన్నారు.

