టీడీపీ సిటీ అధ్యక్షుడుగా మజ్జి రాంబాబు
నూతన కమిటీని ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్
రాజమహేంద్రవరం:
తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులు పార్టీ అధిష్టానం నుంచి నగర టీడీపీ కార్యాలయానికి రాగా మన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాన్ పార్టీ కార్యాలయంలో వెల్లడించారు. నగర టీడీపీ అధ్యక్షుడిగా మజ్జి రాంబాబు, జనరల్ సెక్రటరీ బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకీ రామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులు కంటిపూడి శ్రీనివాస్, కరగాని వేణు, మొకమాటి సత్యనారాయణ, కార్యదర్శులు కడలి రామకృష్ణ, ద్వారా పార్వతి సుందరి, మహ్మద్ అస్లం, కోశాధికారి శెట్టి జగదీష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది పార్టీ కోసం కష్టపడిన వారికి దక్కిన గౌరవమన్నారు. త్వరలోనే భారీ జననందోహంతో ప్రమాణస్వీకార చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం ఆనవాయితీగా జరిగే ప్రక్రియలో భాగమన్నారు. కమిటీ సభ్యులుగా నియమించాలని తాను ఏదో పేరు ఇచ్చేస్తే వారిని ఆమోదించేసే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదన్నారు. అందరి ఆమోదంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి పేర్లను అధిష్టానానికి పంపిన తరువాత వారి నియామకం కోసం ఐవిఆర్ఎన్ కాల్స్ చేయడం జరిగిందన్నారు. అందరి ఆమోదంతోనే ఈ కమిటీ నియామకం జరిగిందని వెల్లడిరచారు. కాగా నూతన కమిటీ సభ్యులను నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శాలువాలతో సత్కరించారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ అధినాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమకు పదవు వచ్చేందుకు అనునిత్యం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిక్కి నాగేంద్ర, యిన్నమూరి దీపు, నక్కా దేవివరప్రసాద్, కోసూరి చండిప్రియ, దాస్యం ప్రసాద్, కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు.

