నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొండాపురం మండల టిడిపి క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు పదర్ల హజరత్ తండ్రి మస్తాన్ గారు కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఉన్నారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా వారి ఇల్లు తీవ్రంగా దెబ్బతినడంతో, స్లాబ్ పాడై, వర్షపు నీరు ఇంట్లోకి చేరి కుటుంబం అంగన్వాడీ భవనంలో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు వెంటనే స్పందించి, తమ “కాకర్ల చారిటబుల్ ట్రస్ట్” ద్వారా రూ.20,000 ఆర్థిక సాయం అందజేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం లాంటిది. మా కార్యకర్తలు లేదా వారి కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారితో ఉండటం, వారికి అండగా నిలవడం మా బాధ్యత. ఎల్లప్పుడూ టిడిపి కార్యకర్తల పక్కనే ఉంటాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలినేని చంద్రబాబు నాయుడు, యారం కిష్టయ్య, అల్లిక మధు, రామ్మోహన్, తిరుపాల్ రెడ్డి, పద్మా రెడ్డి, రవీంద్రారెడ్డి, నర్సారెడ్డి తదితర పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


