Thursday, 5 February 2026
  • Home  
  • టిడిపి కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
- ఎన్ టి ఆర్ జిల్లా

టిడిపి కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్

జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని ఉక్కు కళావేదిక వద్ద శుక్రవారం టిడిపి మండల, పట్టణ, క్లస్టర్, యూనిట్, బూత్, వార్డు, గ్రామ మరియు అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అధ్యక్షత వహించారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతా లకు కట్టుబడి ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మహానేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టడంతో పార్టీలో ఉత్సాహం నెలకొన్నట్లు కార్యకర్తలు తెలిపారు. *కార్పొరేషన్ డైరెక్టర్లకు సన్మానం* విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం డైరెక్టర్‌గా నియమితు లైన మన్నే కళావతి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శేషగిరిరావు (చిన్న), వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ తాళ్లూరి పార్వతిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందించారు. *ప్రజలకు చేరువ కావాలి: ఎమ్మెల్యే సూచన* ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ— నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి –సంక్షేమ కార్యక్రమాలు ప్రతిింటికీ చేరేలా పనిచేయాలని, కుటుంబ సాధికార సారధుల నుంచి బూత్ స్థాయి వరకూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గత కమిటీలు కష్టపడి భారీ మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించాయనిపేర్కొంటూ, కొత్త కార్యవర్గం కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. టిడిపి క్రమశిక్షణ గల పార్టీ అని, బాధ్యతలు పొందిన నాయకులు అంకిత భావంతో వ్యవహరించాలని ఆయన అన్నారు. చంద్రబాబు–లోకేష్ నాయ కత్వంలో అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడు లు, ఉద్యోగావకాశాలు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల దూరదృష్టి ఫలిత మన్నారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రజల్లోనే ఉండి పనిచేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో రంగాపురం రాఘవేంద్ర, ముల్లంగి రామకృష్ణారెడ్డి, కొఠారు సత్యనారాయణ ప్రసాద్, నూకల కుమార్ రాజా, మేక వెంకటేశ్వర్లు, కట్టా వెంకట నరసింహారావు, వడ్లమూడి రాంబాబు, చింతల సీతారామయ్య తదితర నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని ఉక్కు కళావేదిక వద్ద శుక్రవారం టిడిపి మండల, పట్టణ, క్లస్టర్, యూనిట్, బూత్, వార్డు, గ్రామ మరియు అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అధ్యక్షత వహించారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతా లకు కట్టుబడి ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మహానేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టడంతో పార్టీలో ఉత్సాహం నెలకొన్నట్లు కార్యకర్తలు తెలిపారు.

*కార్పొరేషన్ డైరెక్టర్లకు సన్మానం*
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం డైరెక్టర్‌గా నియమితు లైన మన్నే కళావతి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శేషగిరిరావు (చిన్న), వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ తాళ్లూరి పార్వతిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందించారు.

*ప్రజలకు చేరువ కావాలి: ఎమ్మెల్యే సూచన*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ—
నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు ప్రజలకు మరింత చేరువ కావాలని,
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి –సంక్షేమ కార్యక్రమాలు ప్రతిింటికీ చేరేలా పనిచేయాలని,
కుటుంబ సాధికార సారధుల నుంచి బూత్ స్థాయి వరకూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
గత కమిటీలు కష్టపడి భారీ మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించాయనిపేర్కొంటూ, కొత్త కార్యవర్గం కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. టిడిపి క్రమశిక్షణ గల పార్టీ అని, బాధ్యతలు పొందిన నాయకులు అంకిత భావంతో వ్యవహరించాలని ఆయన అన్నారు.
చంద్రబాబు–లోకేష్ నాయ కత్వంలో అభివృద్ధి
రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడు లు, ఉద్యోగావకాశాలు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల దూరదృష్టి ఫలిత మన్నారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రజల్లోనే ఉండి పనిచేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో రంగాపురం రాఘవేంద్ర, ముల్లంగి రామకృష్ణారెడ్డి, కొఠారు సత్యనారాయణ ప్రసాద్, నూకల కుమార్ రాజా, మేక వెంకటేశ్వర్లు, కట్టా వెంకట నరసింహారావు, వడ్లమూడి రాంబాబు, చింతల సీతారామయ్య తదితర నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.