గత వైసిపి ప్రభుత్వ పాలనలో కాకినాడ నగరం నందు ప్రభుత్వ భూములపై టిడిఆర్ బాండ్ల మంజూరు చేయించి దోచుకున్న వారిపై చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు బుధవారం శాసనసభలో ప్రస్తావించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ పాలనలో అప్పటి పాలకులు కాకినాడ నగరంలో ప్రభుత్వ భూములపై టిడిఆర్ బాండ్లు మంజూరు చేయించుకుని కార్పొరేషన్ సొమ్ములను దుర్వినియోగం చేశారని, టిడిఆర్ బాండ్ల కుంభకోణంపై అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటి వైసిపి ప్రభుత్వం అధికారులను సస్పెండ్ చేయడం, బదిలీలు చేయడం జరిగింది తప్ప టిడిఆర్ బాండ్లు మంజూరు చేయించుకున్న వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత టిడిఆర్ బాండ్ల కుంభకోణంపై విజిలెన్స్ దర్యాప్తు కూడా చేయడం జరిగిందని, కానీ నేటికీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు కావస్తున్న టిడిఆర్ బాండ్ల కుంభకోణం దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, టిడిఆర్ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని పేర్కొన్నారు.

టిడిఆర్ బాండ్ల కుంభకోణం చేపట్టిన వారిపై చర్యలు చేపట్టాలి *శాసనసభలో ప్రస్తావించిన కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు*
గత వైసిపి ప్రభుత్వ పాలనలో కాకినాడ నగరం నందు ప్రభుత్వ భూములపై టిడిఆర్ బాండ్ల మంజూరు చేయించి దోచుకున్న వారిపై చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు బుధవారం శాసనసభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ పాలనలో అప్పటి పాలకులు కాకినాడ నగరంలో ప్రభుత్వ భూములపై టిడిఆర్ బాండ్లు మంజూరు చేయించుకుని కార్పొరేషన్ సొమ్ములను దుర్వినియోగం చేశారని, టిడిఆర్ బాండ్ల కుంభకోణంపై అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటి వైసిపి ప్రభుత్వం అధికారులను సస్పెండ్ చేయడం, బదిలీలు చేయడం జరిగింది తప్ప టిడిఆర్ బాండ్లు మంజూరు చేయించుకున్న వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత టిడిఆర్ బాండ్ల కుంభకోణంపై విజిలెన్స్ దర్యాప్తు కూడా చేయడం జరిగిందని, కానీ నేటికీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు కావస్తున్న టిడిఆర్ బాండ్ల కుంభకోణం దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, టిడిఆర్ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని పేర్కొన్నారు.

