Sunday, 1 March 2026
  • Home  
  • టిటిడి ప్రతిష్టను దిగజార్చాలన్నదే వైకాపా లక్ష్యం- తెదేపా నాయకులు
- తిరుపతి

టిటిడి ప్రతిష్టను దిగజార్చాలన్నదే వైకాపా లక్ష్యం- తెదేపా నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 01, శ్రీకాళహస్తి నియోజికవర్గ తెలుగుదేశంపార్టీ నాయకులు టీటీడీ పాలకమండలి అధ్యక్షులు బీ. ఆర్. రెడ్డి పై జరుగుగున్న అసత్యప్రచారంపై వ్యతిరేకిస్తూ ఆదివారం నాడు పత్రిక ప్రకటన ద్వారా వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్బంగా తెదేపా రాష్ట్ర బిసి విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, మాట్లాడుతూ…. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల చేత పూజలందుకుంటూ, హిందువుల కోర్కెలు తీర్చే కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ధార్మిక సంస్థ అయిన టిటిడి పైన జగన్ ముఠా పగబట్టిందని ఆరోపించారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బి.ఆర్.నాయుడును వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేసి, తద్వారా టిటిడి ప్రతిష్టను దిగజార్చాలన్న లక్ష్యంతో ఈరోజు కొందరు బి.ఆర్.నాయుడు పైన ఫేక్ వీడియోలు రిలీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసిపి ప్రభుత్వ పాలనాకాలంలో టిటిడి ఛైర్మన్ లుగా పనిచేసిన వై.వి.సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, నాటి ఈవో ధర్మారెడ్డి లు తిరుమల తిరుపతిలలో కొలువైయున్న దేవాలయాలలో సాగించిన అవినీతి, అక్రమాలను వెలికితీసి ప్రజల ముందుకు తీసుకొని వచ్చారన్న కక్షతో ప్రస్తుత టిటిడి ధర్మకర్తల మండలిపైన జగన్ రెడ్డి ముఠా అనైతిక చర్యలకు పాల్పడుతూ, దుశ్చర్యలకు దిగుతున్నదని కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకొని నకిలీ వీడియోలు, ఫోటోలను సృష్టించి టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు పైన మానసికంగా దాడి చేసి, ఆయన యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూడటం దుర్మార్గపు చర్య, ఇదేవిధంగా ఇటీవల సియం చంద్రబాబు నాయుడు పైన కూడా డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ట్రోల్ చేయడం వైసిపి వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం మన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వైసిపి ప్రభుత్వ పాలనాకాలంలో టిటిడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటాన్ని చూసి వెన్నులో వణుకు పుట్టిన జగన్ బృందం వరుసగా టిటిడికి చెందిన గోశాల పైన, క్యూలైన్ల పైన, వైకుంఠ ఏకాదశి ముందు టికెట్ జారీ ప్రక్రియ పైన, ధర్మకర్తల మండలి సభ్యుల పైన దుష్ప్రచారానికి దిగుతూ ఈరోజు ఛైర్మన్‌గా ఉన్న బి.ఆర్.నాయుడు పైనే అనైతిక దాడులకు తెగబడ్డారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.