నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
SPS నెల్లూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారతీయ సామాజిక సంస్కర్త, మేధావి, రచయిత శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, అడిషనల్ ఎస్.పి. (అడ్మిన్) CH. సౌజన్య , జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ,
“జ్యోతిరావు పూలే గారు పాశ్చాత్య సమాజ రుగ్మతలను ఎదురించి, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. బాలికల విద్య కోసం పాఠశాలలు స్థాపించి, వితంతువుల రక్షణ కోసం ఆశ్రమాలు నిర్మించారు. తన సతీమణి సావిత్రీబాయి పూలేకు విద్యను నేర్పి, ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దడం ద్వారా మహిళా విద్యకు మార్గం తీర్చారు. ఈయన ఆశయాలు నేటితరానికి స్ఫూర్తిదాయకం,” అని తెలిపారు.
జిల్లా పోలీసులు జయంతిని ఘనంగా నిర్వహించి, పూలే గారి సేవలను స్మరించుకున్నారు.
వారి ఆశయాల సాధన దిశగా అందరూ కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.