అలంపూర్ : అక్టోబర్ 29 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్….
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్. ఆలయ ఈఓ దీప్తి, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించారు. కుంకుమార్చన పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో దీప్తి అధికారులకు శేష వస్త్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత. గద్వాల సంస్థాన వారసుడు కృష్ణా రాంభూపాల్. ఆలయ కమిటీ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ దేవికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ.
అలంపూర్ : అక్టోబర్ 29 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్…. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్. ఆలయ ఈఓ దీప్తి, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించారు. కుంకుమార్చన పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో దీప్తి అధికారులకు శేష వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత. గద్వాల సంస్థాన వారసుడు కృష్ణా రాంభూపాల్. ఆలయ కమిటీ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

