Thursday, 5 February 2026
  • Home  
  • జోగులాంబ ఆలయ ఈఓ బదిలీ — ముగ్గురు అర్చకులు సస్పెండ్.
- జోగులాంబ గద్వాల

జోగులాంబ ఆలయ ఈఓ బదిలీ — ముగ్గురు అర్చకులు సస్పెండ్.

అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఈవో, ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా ఓ ప్రజాప్రతినిధి సోదరుని కుమార్తె వివాహ వేడుకలు నిర్వహించి, ఆశీర్వాదాలు అందజేసిన అంశానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో జోగులాంబ దేవాలయ ఈఓను బదిలీ చేస్తూ, ముగ్గురు అర్చకులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వపరంగా వేతనాలు పొందుతూ ఆయా దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, వేద పండితులు, పురోహితులు రాష్ట్రం లేదా ఇతర దేశాల్లో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలంటే లేదా నిర్వహించాలంటే దేవాదాయశాఖ కమిషనర్ అనుమతులు ముందుగానే పొందవలసి ఉంటుంది. ఈ అంశంపై విచారణ జరిపిన అధికారులు, విచారణ పెండింగ్లో ఉన్న కారణంగా సస్పెండ్ చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, బదిలీ అయిన ఈఓ స్థానంలో జడ్చర్ల మండలం గంగాపురం దేవాలయ ఈఓగా పనిచేస్తున్న దీప్తికి జోగులాంబ దేవాలయ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఈవో, ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా ఓ ప్రజాప్రతినిధి సోదరుని కుమార్తె వివాహ వేడుకలు నిర్వహించి, ఆశీర్వాదాలు అందజేసిన అంశానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో జోగులాంబ దేవాలయ ఈఓను బదిలీ చేస్తూ, ముగ్గురు అర్చకులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వపరంగా వేతనాలు పొందుతూ ఆయా దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, వేద పండితులు, పురోహితులు రాష్ట్రం లేదా ఇతర దేశాల్లో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలంటే లేదా నిర్వహించాలంటే దేవాదాయశాఖ కమిషనర్ అనుమతులు ముందుగానే పొందవలసి ఉంటుంది.
ఈ అంశంపై విచారణ జరిపిన అధికారులు, విచారణ పెండింగ్లో ఉన్న కారణంగా సస్పెండ్ చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, బదిలీ అయిన ఈఓ స్థానంలో జడ్చర్ల మండలం గంగాపురం దేవాలయ ఈఓగా పనిచేస్తున్న దీప్తికి జోగులాంబ దేవాలయ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.