అలంపూర్, సెప్టెంబర్ 27 ( పున్నమి ప్రతినిధి )
తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ–బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత, కుమార్తె, అల్లుడు శనివారం దర్శించుకున్నారు.
ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్‌కుమార్–మహాలక్ష్మి దంపతులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.
ఆలయ పాలకమండలి సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. ముందుగా గణపతిని ప్రార్థించిన సీఎం కుటుంబ సభ్యులు, అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామివారికి నమక–చమకాలతో రుద్రాభిషేకం చేశారు. జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఖడ్గమాల, త్రిశతి అర్చనలు నిర్వహించి, అమ్మవారికి ఒడిబియ్యం, మంగళద్రవ్యాలు, చీర, సారే సమర్పించారు. శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంలో ఆరవ రోజు కాత్యాయిని రూపంగా జోగులాంబ దేవిని వారు ఆరాధించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంపత్‌కుమార్ దంపతులు, పాలకమండలి సభ్యులు, దేవస్థానం తరఫున శేష వస్త్రాలు సీఎం కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో గద్వాల తాలూకా ఇన్చార్జి సరిత తిరుపతయ్య, గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర టెలికం మెంబర్ ఇస్మాయిల్, మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, ఓబిసి చైర్మన్ నల్లారెడ్డి, సెల్ అధ్యక్షులు ఎనుముల నాగరాజు, లక్ష్మీనారాయణ రెడ్డి, అలంపూర్ తాలూకా ఆయా మండలాల అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్లు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అభిమానులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


