భారత్లో పర్యటనకు వచ్చిన ఓ విదేశీ మహిళకు రాజస్థాన్లో అనుకోని, అసౌకర్యకర పరిస్థితి ఎదురైంది. జైపూర్లోని జల్ మహల్ సందర్శనకు వెళ్లిన ఆమెను కొంతమంది స్థానిక యువకులు చుట్టుముట్టి సెల్ఫీల కోసం అతిగా ప్రవర్తించారు.
మొదట సాధారణంగా కనిపించిన ఈ సంఘటన, కొంతమంది యువకులు ఆమె భుజాలపై చేతులు వేయడం, అనుచితంగా తాకడం వంటి చర్యలతో అసభ్యకరంగా మారింది. దీనితో ఆ మహిళ తీవ్ర అసౌకర్యానికి గురై అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పటికీ, వారు ఆమెను వదలకుండా మరింతగా ఇబ్బంది పెట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దివ్య గండోత్ర ఠండన్ సోషల్ మీడియా వేదికలో పంచుకోగా, అది వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి ప్రవర్తన వల్ల దేశ ప్రతిష్టకు నష్టం కలుగుతుందని, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అభిప్రాయపడ్డారు.
👉 విదేశీ పర్యాటకుల పట్ల గౌరవం, రక్షణ కల్పించడం అత్యవసరం అని పలువురు పేర్కొన్నారు.

