

జేసీఐ శ్రీకాకుళం సన్‌రైజర్స్ఆధ్వర్యంలో గ్రాటిట్యూడ్ అండ్ సెలబ్రేషన్ డే ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రాండ్ కన్వెర్సన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు సింగూరు. ప్రవీణ్ కుమార్ మంగళవారం మాట్లాడుతూ శ్రీకాకుళం యువత ఉన్నత దిశగా ప్రయాణించాలని, జెసిఐ వారోత్సవాల్లో ఏడు రోజులు చేసిన కార్యక్రమాలను వివరిస్తూ, చివరి రోజు పండగల చేసుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభావంతుల ప్రదర్శనలు నిర్వహించగా, సుమారు 100 మంది సభ్యులు, అతిథులు పాల్గొన్నారని, ఈ సందర్భంగా ప్రాజెక్ట్ చైర్మన్ వెంకటేష్ ఐటమ్, డే కోఆర్డినేటర్స్ జగదీష్, దామోదర్, ఉమా మహేష్, ఈశ్వర్, షర్మిల, అశోక్, శ్రీను లను ప్రత్యేకంగా సత్కరించామని, జెసిఐ వారోత్సవాలను విజయవంతం చేసిన ప్రతీ సభ్యునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జెసిఐ ఇండియా జోన్ 4 అడ్వైజర్ రఘురాం ప్రతి, జేసీ డాక్టర్.వినోద్ కుమార్, డాక్టర్ గీతా శ్రీకాంత్ లు మాట్లాడుతూ యువతకు కల్పించే అపారమైన అవకాశాలకు జేసీఐ వేదికని, విద్యార్థి దశ నుంచే యువతకు కావలసిన ట్రైనింగ్, లీడర్‌షిప్ క్వాలిటీస్, ఎమర్జెన్సీ టీమ్ సపోర్ట్ వీటన్నింటినీ జెసిఐ శ్రీకాకుళం సన్‌రైజర్స్ ఉచితంగా అందిస్తున్నారని, మిషన్ నవ నాయక్ కోసం తెలిపారు. జోన్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ జెసిఐ శ్రీకాకుళం సన్‌రైజర్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలలో ముందంజలో ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, జేసీ సభ్యులు, టీమ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

