జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వెల్దండ కాంగ్రెస్ పార్టీ నాయకులు
వెల్దండ, అక్టోబర్ 25 పున్నమి న్యూస్: హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని దండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి రషీద్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు శ్రీకాంత్ చారి, వెల్దండ కమాన్ నిర్మాణదాత బొల్లంపల్లి సిలివేరు రామస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


