Monday, 8 December 2025
  • Home  
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం కోసం ప్రచారానికి స్టార్ క్యాంపైనర్ ల జాబిత విడుదల చెసిన బీజేపీ
- హైదరాబాద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం కోసం ప్రచారానికి స్టార్ క్యాంపైనర్ ల జాబిత విడుదల చెసిన బీజేపీ

హైదరాబాద్ అక్టోబర్ పున్నమి ప్రతి నిధి జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం కోసం పార్టీ కీలక నేతలు ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు అక్టోబర్‌ 14న బీజేపీ సెంట్రల్‌ ఆఫీస్‌ 40 మంది నేతల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, సునీల్‌ బన్సల్‌, తేజస్వి సూర్య, ధర్మపురి అరవింద్‌ వంటి ప్రముఖ నేతలు ఉన్నారు. అలాగే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్‌ పురందేశ్వరి, బుర్రా నర్సయ్య గౌడ్‌, సుజనా చౌదరి, కాసం వెంకటేశ్వర్లూ యాదవ్‌, పాంగులేటి సుధాకర్‌రెడ్డి, పీవీ మాధవ్‌, బండా కార్తీకరెడ్డి వంటి నేతలు కూడా ప్రచార బృందంలో చోటు దక్కించుకున్నారు. పార్టీ నిర్ణయాల ప్రకారం వీరు త్వరలో ప్రచార షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌లో పర్యటించి బీజేపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, జాతీయ స్థాయి నేతలతో బలమైన ప్రచార యుద్ధానికి సిద్ధమవుతోంది.

హైదరాబాద్ అక్టోబర్
పున్నమి ప్రతి నిధి

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం కోసం పార్టీ కీలక నేతలు ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు అక్టోబర్‌ 14న బీజేపీ సెంట్రల్‌ ఆఫీస్‌ 40 మంది నేతల జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, సునీల్‌ బన్సల్‌, తేజస్వి సూర్య, ధర్మపురి అరవింద్‌ వంటి ప్రముఖ నేతలు ఉన్నారు.

అలాగే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్‌ పురందేశ్వరి, బుర్రా నర్సయ్య గౌడ్‌, సుజనా చౌదరి, కాసం వెంకటేశ్వర్లూ యాదవ్‌, పాంగులేటి సుధాకర్‌రెడ్డి, పీవీ మాధవ్‌, బండా కార్తీకరెడ్డి వంటి నేతలు కూడా ప్రచార బృందంలో చోటు దక్కించుకున్నారు.

పార్టీ నిర్ణయాల ప్రకారం వీరు త్వరలో ప్రచార షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌లో పర్యటించి బీజేపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, జాతీయ స్థాయి నేతలతో బలమైన ప్రచార యుద్ధానికి సిద్ధమవుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.