పున్నమి ప్రతినిధి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సందర్బంగా ఖమ్మం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో ఖమ్మం నియోజకవర్గ నాయకులు పాల్గొని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు.
దివంగత నేత మాగంటి గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తి..నాకు అయనతో వ్వక్తిగత సంబంధం ఉంది అయన మరణం తీరని లోటని అన్నారు
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కరోనా వచ్చి అందరు బయపడుతుంటే గోపినాథ్ గారు అయన కార్యకర్తలతో ఖమ్మం వచ్చి కార్పొరేషన్ ఎన్నికల్లో పనిచేసి గెలుపు కొరకు ప్రధాన పాత్ర పోషించారని అన్నారు..
ఈ ఉప ఎన్నికల్లో మనం కూడా కష్టపడి పనిచేసి మాగంటి గోపినాథ్ గారి సతీమణి సునీత గారిని గెలిపించి రుణం తీర్చుకోవాలని అన్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు విసుగుచెంది మరలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన దొంగ హామీలు రైతు రుణమాపీ,రైతు భరోసా,రైతు బందు,నిరుద్యోగ భృతి,4వేల పెంక్షన్,ప్రతి మహిళకు 2500,ఆడపిల్లలకు స్కూటీలు,కల్యాణలక్ష్మితులం బంగారం ఇవ్వకుండా ప్రజలను మభ్యపెడుతుందని ఈ విషయాలన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.


