పున్నమి ప్రతినిధి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని బోరబండ డివిజన్‌లో బీఆర్‌ఎస్ మరింత బలం పుంజుకుంది. బోరబండ డివిజన్ ఎంఐఎం (MIM) ప్రెసిడెంట్ షేక్ మునీర్ ఈరోజు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
గతంలో ఈ డివిజన్ నుంచి ఆయన కార్పొరేటర్‌గా కూడా పోటీ చేశారు. ఈరోజు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. కేటీఆర్ గారు షేక్ మునీర్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఎంఐఎం తరఫున మైనార్టీ కమ్యూనిటీలో మంచి పట్టు ఉన్న షేక్ మునీర్ బీఆర్‌ఎస్‌లో చేరడంతో బోరబండ డివిజన్‌లో పార్టీకి మరింత బలం చేకూరనుంది.


