Monday, 23 March 2026
  • Home  
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
- తెలంగాణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

పున్నమి: అక్టోబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం(ELection Commission) విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 21 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈనెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. షేక్‌పేట్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు స్వీకరించనున్నారు. కాగా, జూబ్లీహిల్స్నియోజకవర్గంలో మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. నేడో, రేపు బీజేపీ సైతం క్యాండి‌డేట్‌ను ఖరారు చేయనున్నది. ఈ ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఆశపడుతుండగా.. ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. మరోవైపు గెలుపు కోసం బీజేపీ సైతం తహతహలాడుతున్నది. దీపావళి తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇక్కడే మోహరించనున్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. Video: http://punnami.in/%20జూబ్లీహిల్స్

పున్నమి: అక్టోబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం(ELection Commission) విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 21 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈనెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. షేక్‌పేట్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు స్వీకరించనున్నారు. కాగా, జూబ్లీహిల్స్నియోజకవర్గంలో మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. నేడో, రేపు బీజేపీ సైతం క్యాండి‌డేట్‌ను ఖరారు చేయనున్నది.

ఈ ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఆశపడుతుండగా.. ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. మరోవైపు గెలుపు కోసం బీజేపీ సైతం తహతహలాడుతున్నది. దీపావళి తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇక్కడే మోహరించనున్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

Video: http://punnami.in/%20జూబ్లీహిల్స్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.