జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన విశాఖ జిల్లా కలెక్టర్.
విశాఖపట్నం ,అక్టోబర్ పున్నమి ప్రతినిధి : విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎమ్ ఎన్. హరేంద్ర ప్రసాద్ మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల సిటీ ఆపరేషన్స్ సెంటర్ ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి సందర్శించారు.
సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా తుఫాన్ కు సంబంధించి చేపడుతున్న జాగ్రత్తలు, చర్యలను కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు.
జీవీఎంసీ ఉన్నతాధికారులందరూ విభాగాల వారీగా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో, ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులపై, చేపట్టవలసిన చర్యలపై జోనల్ కమిషనర్లకు ఫీల్డ్ లో ఉన్న ఉద్యోగులుకు, సిబ్బందికి, సచివాలయ కార్యదర్శులకు సూచనలను అందిస్తూ వస్తున్న సమస్యలపై వారికి పరిష్కార మార్గాలను తెలియజేయడం జరుగుతుందని కలెక్టర్ కు కమిషనర్ వివరించారు.
అర్ధరాత్రి ఏ సమయంలో అయినా విశాఖ నగరానికి తుఫాను ప్రభావితం ఉండవచ్చునని అధికారులందరూ నిశితంగా పరిశీలిస్తూ, జోనల్ కంట్రోల్ రూమ్ లను, సచివాలయాల లో ఉద్యోగులు ,అధికారులు, సచివాలయం కార్యదర్శులు సంసిద్ధంగా అప్రమత్తతో ఉండి ప్రజలకు అందించవలసిన సహాయ సహకారాలపై ప్రత్యేక దృష్టి సారించాలని , ఉన్నత అధికారులు నిరంతర పరిశీలన చర్యలు చేపట్టాలని కమిషనర్ కు కలెక్టర్ సూచించారు


