Wednesday, 25 March 2026
  • Home  
  • జీవీఎంసీలో ఘనంగా “విశాఖ ప్రగతి బంధు” అభినందన కార్యక్రమం.
- విశాఖపట్నం

జీవీఎంసీలో ఘనంగా “విశాఖ ప్రగతి బంధు” అభినందన కార్యక్రమం.

జీవీఎంసీలో ఘనంగా “విశాఖ ప్రగతి బంధు” అభినందన కార్యక్రమం. *గ్రేటర్ విశాఖగా జీవీఎంసీ లో 20 వసంతాల వేడుకలు. *విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీ కి సకాలంలో ఆస్తి , ఖాళీ స్థలాల పన్నులు, నీటి చార్జీలు చెల్లించిన పన్నుదారులకు సన్మానాలు, కృతజ్ఞతలు. *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి * విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గా ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీలో 20 వసంతాల వేడుకలను జరుపుకోవడమైనదని, విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీకి సకాలంలో బాధ్యతతో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను చెల్లించిన ఆస్తిపన్ను దారులను “విశాఖ ప్రగతి బంధు” పేరున అభినందించి ,ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించుకోవడం జరిగినదని , వారందరికీ జీవీఎంసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలను విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో “విశాఖ ప్రగతి బంధు” అభినందన కార్యక్రమం నిర్వహించి సకాలంలో పన్నులను చెల్లించిన ఆస్తి పన్ను దారులకు సన్మానం నిర్వహించిన అనంతరం 20 వసంతాల వేడుకలు సందర్భంగా నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్ డివి రమణమూర్తి, డిసిఆర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులతో కలసి కేక్ ను కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖపట్నం అభివృద్ధి దిశగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కు సహకరిస్తున్న ఆస్తి పన్ను చెల్లింపుదారులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గ్రేటర్ విశాఖపట్నం గా జీవీఎంసీ ఆవిర్భవించి 20 వసంతాలు పూర్తయినందున జీవీఎంసీలో “విశాఖ ప్రగతి బంధు” కార్యక్రమం ద్వారా సకాలంలో పన్నులను చెల్లించి విశాఖ నగర అభివృద్ధికి సహకరిస్తున్న ఆస్తి పన్నుదారులను సన్మానించుకోవాల్సిన అవసరం జీవీఎంసీకి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో విశాఖ ప్రగతి పథములో ముందు ఉందని విశాఖ ఎంతో అందమైన నగరమని, ఇక్కడ ప్రజలు బాధ్యతతో నిర్ణీత కాలంలో జీవీఎంసీకి ఆస్తి ,ఖాళీ స్థలాల పన్నులు ,నీటి చార్జీలు చెల్లించి సహకరిస్తున్నందుకు జీవీఎంసీ ప్రజలందరికీ రుణపడి ఉందన్నారు. గ్రేటర్ విశాఖపట్నం 3వేల 600 కిలోమీటర్ల రోడ్లు, కాలువలు విస్తరించి ఉందని, వాటిని నిత్యం పరిశుభ్రతతో తీర్చిదిద్దడం వలన విశాఖ నగరం మరింత అందంగా కనబడుతుందన్నారు. అధికారులు పాలకమండలి ముందస్తు చర్యలతో అనేక విపత్తులను సమర్దవంతంగా ఎదుర్కొందని తెలిపారు. ముఖ్యంగా జీవీఎంసీ అభివృద్ధికి రెవిన్యూ ఎంతో అవసరమని అందుకు ప్రతి ఒక్కరు సకాలంలో తమ ఆస్తి పన్నులను చెల్లించి విశాఖ నగర అభివృద్ధికి సహకరించాలన్నారు. జీవీఎంసీ కమిషనర్ తో పాటు అధికారులు అందరూ రోజులో అధిక సమయం విధులు నిర్వహించడం వలన నగరం ఎంతో పరిశుభ్రతగా ఉందని అన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజులు మాట్లాడుతూ జీవీఎంసీ ఆవిర్భవించి 20 వసంతాల వేడుకలను జరుపుకోవడం అలాగే మొదటిసారి గా ఆస్తి చెల్లింపు దారులను అభినందించడం ద్వారా వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది ముందుకు వచ్చి ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మరింత ఆర్థిక పరిపుష్టికి చేరుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా ” విశాఖ ప్రగతి బంధు ” కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు, పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు తెలిపారు. అధికారులు కష్టించి పని చేయడం వలన విశాఖ నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నగరంలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నందున విశాఖకు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ దేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద నగరాలలో మొదటిది ఢిల్లీ అని, 2వ నగరం మన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అని తెలిపారు. అంతేకాకుండా దేశంలో పలు రాష్ట్రాలే కాకుండా కొన్ని ఇతర దేశాల కంటే కూడా జీవీఎంసీ పెద్దగా విస్తరించి ఉందని తెలిపారు. ఇంత పెద్ద నగరంలో ప్రజలకు సంక్షేమము, మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించడం కొరకు జీవీఎంసీ కి రెవెన్యూ ఎంతో అవసరం అని తెలిపారు. విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీ ఆర్థిక పరిపుష్టికి ఎంతో బాధ్యతతో నిర్ణీత కాలంలో పన్నులను చెల్లించిన ఆస్తి పన్నుదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ విశాఖ 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీ సకాలంలో పన్నుల చెల్లించిన 6 క్యాటగిరీలుగా గుర్తించిన ఆస్తిపన్ను దారులను “విశాఖ ప్రగతి బంధు” పేరున వారిని అభినందించి, జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను, అందించి సన్మానించడం జరిగిందని తెలిపారు. విశాఖ అభివృద్ధికి నగర మేయర్ ఎంతో కృషి చేస్తున్నారని కౌన్సిల్, స్థాయి సంఘాలలో ఎక్కువ అభివృద్ధి పనుల అంశాలను పెట్టి విశాఖ నగర అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. ప్రజా ఆరోగ్య అధికారులు ఉదయం 6 గంటలకు విధులకు వచ్చి తమ విధుల్లో పాల్గొంటారని, ప్రస్తుతం రెవిన్యూ అధికారులు కూడా 6 గంటలకే విధులకు వచ్చి జీవీఎంసీ ఆర్థిక పరిపుష్టిని పెంచేందుకు నిరంతరం బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నారని కమీషనర్ తెలిపారు. జీవీఎంసీ కి వచ్చే ఆదాయం తో పాటు కేంద్ర ,రాష్ట్రాల నిధులను విశాఖ అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. జీవీఎంసీ ఆదాయం పెంచి ఆస్తి పన్ను చెల్లింపు కొరకు 8 సౌకర్య కేంద్రాలకు బదులు ప్రస్తుతం 20 సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా విశాఖ అభివృద్ధికి సహకరిస్తున్న కార్పొరేట్ సంస్థలకు కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ జీవీఎంసీ ప్రగతికి ఏకైక మార్గం రెవిన్యూ అని దానికి ఆస్తి పన్నుల ద్వారా సమకూర్చుకోవచ్చు అన్నారు. కార్పొరేట్ సంస్థలు సి.ఎస్.ఆర్ ఫండ్స్ తో సహకారం అందించి విశాఖ అభివృద్ధికి కృషి చేస్తున్నాయని, ప్రజలు, ఆస్తి పన్నులు చెల్లింపుదారుల నిర్ణీత సమయంలో పన్నులు చెల్లిస్తూ సహకారం అందించడం ద్వారా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో 56వ వార్డు కార్పొరేటర్ శరగడం రాజశేఖర్, జివిఎంసి అధికారులు, కొరమోఁడల్, ఎస్సార్ స్టీల్, టెక్ మహీంద్ర సంస్థల ప్రతినిధులు, ఎ.పి.పెర్వాస్ కార్యదర్శి, జె.ఆర్.నగర్ నివాసిత సంక్షేమ సంఘం ప్రతినిధి డా.కె.ఎస్.ఆర్.మూర్తి, పరువురు సన్మాన గ్రహీతలు, ఎస్.ఆర్.యు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రాజమణి, జివిఎంసి ఉద్యోదులు తదితరులు పాల్గొన్నారు.

జీవీఎంసీలో ఘనంగా “విశాఖ ప్రగతి బంధు” అభినందన కార్యక్రమం.

*గ్రేటర్ విశాఖగా జీవీఎంసీ లో 20 వసంతాల వేడుకలు.

*విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీ కి సకాలంలో ఆస్తి , ఖాళీ స్థలాల పన్నులు, నీటి చార్జీలు చెల్లించిన పన్నుదారులకు సన్మానాలు, కృతజ్ఞతలు.

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి * విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గా ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీలో 20 వసంతాల వేడుకలను జరుపుకోవడమైనదని, విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీకి సకాలంలో బాధ్యతతో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను చెల్లించిన ఆస్తిపన్ను దారులను “విశాఖ ప్రగతి బంధు” పేరున అభినందించి ,ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించుకోవడం జరిగినదని , వారందరికీ జీవీఎంసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలను విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో “విశాఖ ప్రగతి బంధు” అభినందన కార్యక్రమం నిర్వహించి సకాలంలో పన్నులను చెల్లించిన ఆస్తి పన్ను దారులకు సన్మానం నిర్వహించిన అనంతరం 20 వసంతాల వేడుకలు సందర్భంగా నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్ డివి రమణమూర్తి, డిసిఆర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులతో కలసి కేక్ ను కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖపట్నం అభివృద్ధి దిశగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కు సహకరిస్తున్న ఆస్తి పన్ను చెల్లింపుదారులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గ్రేటర్ విశాఖపట్నం గా జీవీఎంసీ ఆవిర్భవించి 20 వసంతాలు పూర్తయినందున జీవీఎంసీలో “విశాఖ ప్రగతి బంధు” కార్యక్రమం ద్వారా సకాలంలో పన్నులను చెల్లించి విశాఖ నగర అభివృద్ధికి సహకరిస్తున్న ఆస్తి పన్నుదారులను సన్మానించుకోవాల్సిన అవసరం జీవీఎంసీకి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో విశాఖ ప్రగతి పథములో ముందు ఉందని విశాఖ ఎంతో అందమైన నగరమని, ఇక్కడ ప్రజలు బాధ్యతతో నిర్ణీత కాలంలో జీవీఎంసీకి ఆస్తి ,ఖాళీ స్థలాల పన్నులు ,నీటి చార్జీలు చెల్లించి సహకరిస్తున్నందుకు జీవీఎంసీ ప్రజలందరికీ రుణపడి ఉందన్నారు. గ్రేటర్ విశాఖపట్నం 3వేల 600 కిలోమీటర్ల రోడ్లు, కాలువలు విస్తరించి ఉందని, వాటిని నిత్యం పరిశుభ్రతతో తీర్చిదిద్దడం వలన విశాఖ నగరం మరింత అందంగా కనబడుతుందన్నారు. అధికారులు పాలకమండలి ముందస్తు చర్యలతో అనేక విపత్తులను సమర్దవంతంగా ఎదుర్కొందని తెలిపారు. ముఖ్యంగా జీవీఎంసీ అభివృద్ధికి రెవిన్యూ ఎంతో అవసరమని అందుకు ప్రతి ఒక్కరు సకాలంలో తమ ఆస్తి పన్నులను చెల్లించి విశాఖ నగర అభివృద్ధికి సహకరించాలన్నారు. జీవీఎంసీ కమిషనర్ తో పాటు అధికారులు అందరూ రోజులో అధిక సమయం విధులు నిర్వహించడం వలన నగరం ఎంతో పరిశుభ్రతగా ఉందని అన్నారు.

అనంతరం డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజులు మాట్లాడుతూ జీవీఎంసీ ఆవిర్భవించి 20 వసంతాల వేడుకలను జరుపుకోవడం అలాగే మొదటిసారి గా ఆస్తి చెల్లింపు దారులను అభినందించడం ద్వారా వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది ముందుకు వచ్చి ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మరింత ఆర్థిక పరిపుష్టికి చేరుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా ” విశాఖ ప్రగతి బంధు ” కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు, పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు తెలిపారు. అధికారులు కష్టించి పని చేయడం వలన విశాఖ నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నగరంలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నందున విశాఖకు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.

అనంతరం జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ దేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద నగరాలలో మొదటిది ఢిల్లీ అని, 2వ నగరం మన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అని తెలిపారు. అంతేకాకుండా దేశంలో పలు రాష్ట్రాలే కాకుండా కొన్ని ఇతర దేశాల కంటే కూడా జీవీఎంసీ పెద్దగా విస్తరించి ఉందని తెలిపారు. ఇంత పెద్ద నగరంలో ప్రజలకు సంక్షేమము, మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించడం కొరకు జీవీఎంసీ కి రెవెన్యూ ఎంతో అవసరం అని తెలిపారు. విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీ ఆర్థిక పరిపుష్టికి ఎంతో బాధ్యతతో నిర్ణీత కాలంలో పన్నులను చెల్లించిన ఆస్తి పన్నుదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ విశాఖ 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీ సకాలంలో పన్నుల చెల్లించిన 6 క్యాటగిరీలుగా గుర్తించిన ఆస్తిపన్ను దారులను “విశాఖ ప్రగతి బంధు” పేరున వారిని అభినందించి, జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను, అందించి సన్మానించడం జరిగిందని తెలిపారు. విశాఖ అభివృద్ధికి నగర మేయర్ ఎంతో కృషి చేస్తున్నారని కౌన్సిల్, స్థాయి సంఘాలలో ఎక్కువ అభివృద్ధి పనుల అంశాలను పెట్టి విశాఖ నగర అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. ప్రజా ఆరోగ్య అధికారులు ఉదయం 6 గంటలకు విధులకు వచ్చి తమ విధుల్లో పాల్గొంటారని, ప్రస్తుతం రెవిన్యూ అధికారులు కూడా 6 గంటలకే విధులకు వచ్చి జీవీఎంసీ ఆర్థిక పరిపుష్టిని పెంచేందుకు నిరంతరం బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నారని కమీషనర్ తెలిపారు. జీవీఎంసీ కి వచ్చే ఆదాయం తో పాటు కేంద్ర ,రాష్ట్రాల నిధులను విశాఖ అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. జీవీఎంసీ ఆదాయం పెంచి ఆస్తి పన్ను చెల్లింపు కొరకు 8 సౌకర్య కేంద్రాలకు బదులు ప్రస్తుతం 20 సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా విశాఖ అభివృద్ధికి సహకరిస్తున్న కార్పొరేట్ సంస్థలకు కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ జీవీఎంసీ ప్రగతికి ఏకైక మార్గం రెవిన్యూ అని దానికి ఆస్తి పన్నుల ద్వారా సమకూర్చుకోవచ్చు అన్నారు. కార్పొరేట్ సంస్థలు సి.ఎస్.ఆర్ ఫండ్స్ తో సహకారం అందించి విశాఖ అభివృద్ధికి కృషి చేస్తున్నాయని, ప్రజలు, ఆస్తి పన్నులు చెల్లింపుదారుల నిర్ణీత సమయంలో పన్నులు చెల్లిస్తూ సహకారం అందించడం ద్వారా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమం లో 56వ వార్డు కార్పొరేటర్ శరగడం రాజశేఖర్, జివిఎంసి అధికారులు, కొరమోఁడల్, ఎస్సార్ స్టీల్, టెక్ మహీంద్ర సంస్థల ప్రతినిధులు, ఎ.పి.పెర్వాస్ కార్యదర్శి, జె.ఆర్.నగర్ నివాసిత సంక్షేమ సంఘం ప్రతినిధి డా.కె.ఎస్.ఆర్.మూర్తి, పరువురు సన్మాన గ్రహీతలు, ఎస్.ఆర్.యు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రాజమణి, జివిఎంసి ఉద్యోదులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.