Tuesday, 24 March 2026
  • Home  
  • *జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి మేలు* *జీఎస్టీలో సంస్కరణలు తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడి….చక్కగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు* *13వ డివిజన్‌లో జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌
- ఎన్ టి ఆర్ జిల్లా

*జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి మేలు* *జీఎస్టీలో సంస్కరణలు తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడి….చక్కగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు* *13వ డివిజన్‌లో జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

*జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి మేలు* *జీఎస్టీలో సంస్కరణలు తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడి….చక్కగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు* *13వ డివిజన్‌లో జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌* కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జీఎస్టీ అమలులో తీసుకువచ్చి సంస్కరణల వల్ల రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. నరేంద్రమోడీ తీసుకువచ్చిన సంస్కరణలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో చక్కగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్‌ డొంకరోడ్డు చివర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడి స్థానికులను అడిగి తెల్సుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం జీఎస్టీ–2.0 సంస్కరణలపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. నూనెల తప్ప అన్ని వస్తువులపై ధరలు తగ్గాయని ప్రజలు చెబుతున్నారని, నూనెలపై కూడా పన్నులు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. జీఎస్టీలో తెచ్చిన సంస్కరణలు ప్రజల్లోకి వెళ్ళాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఏసీలు, టీవీలు, కార్ల ధరల చాలా తగ్గాయని వాటిని కొనుగోలు చేసే స్థాయి ఉన్నవాళ్లు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై జీఎస్టీ లేకపోవడం వల్ల చాలా మంది ఇన్సూరెన్స్‌ ప్రీమియంలను తీసుకుంటున్నారని, దీనివల్ల వారి జీవితానికి భరోసా ఉంటుందన్నారు. బీమా తీసుకున్న వారికి జీవితంలో ఏవిధమైన ఇబ్బంది వచ్చినా వారికి ధైర్యంగా ఉంటుందని చెప్పారు. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడిని అందరూ అభినందించాలన్నారు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం గత 8 నెలలుగా ఆలోచనలు చేసి ఈ సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. జీఎస్టీపై సంస్కరణలకు మొదటి సారిగా మద్దతు తెలియజేసిన ప్రభుత్వం తమదేనని చెప్పుకొచ్చారు. ఈ సంస్కరణల వల్ల ఏడాదికి రూ.8 కోట్లు లోటు అని, అయినా ప్రజా సంక్షేమం కోసం ఈ సంస్కరణలకు తమ ప్రభుత్వం మద్దతు తెలియజేశామని వివరించారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడికి, రాష్ట్రంలో చక్కగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కార్పోరేటర్‌ ముమ్మనేని ప్రసాద్, గద్దె ప్రసాద్, నూతి శ్రీను, వీరంకి డాంగే కుమారి, గాదిరెడ్డి అమ్ములు, లోకేష్‌ రావు, మాదిరెడ్డి రవి, శ్రీమన్నారాయణ, బూస్, ముమ్మనేని మానస, కంఠంనేనని మానస, కల్పన, జె.హారికతో పాటుగా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి మేలు*

*జీఎస్టీలో సంస్కరణలు తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడి….చక్కగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు*

*13వ డివిజన్‌లో జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జీఎస్టీ అమలులో తీసుకువచ్చి సంస్కరణల వల్ల రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. నరేంద్రమోడీ తీసుకువచ్చిన సంస్కరణలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో చక్కగా అమలు చేస్తున్నారని చెప్పారు.

ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్‌ డొంకరోడ్డు చివర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడి స్థానికులను అడిగి తెల్సుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం జీఎస్టీ–2.0 సంస్కరణలపై ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. నూనెల తప్ప అన్ని వస్తువులపై ధరలు తగ్గాయని ప్రజలు చెబుతున్నారని, నూనెలపై కూడా పన్నులు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. జీఎస్టీలో తెచ్చిన సంస్కరణలు ప్రజల్లోకి వెళ్ళాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఏసీలు, టీవీలు, కార్ల ధరల చాలా తగ్గాయని వాటిని కొనుగోలు చేసే స్థాయి ఉన్నవాళ్లు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై జీఎస్టీ లేకపోవడం వల్ల చాలా మంది ఇన్సూరెన్స్‌ ప్రీమియంలను తీసుకుంటున్నారని, దీనివల్ల వారి జీవితానికి భరోసా ఉంటుందన్నారు. బీమా తీసుకున్న వారికి జీవితంలో ఏవిధమైన ఇబ్బంది వచ్చినా వారికి ధైర్యంగా ఉంటుందని చెప్పారు. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడిని అందరూ అభినందించాలన్నారు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం గత 8 నెలలుగా ఆలోచనలు చేసి ఈ సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. జీఎస్టీపై సంస్కరణలకు మొదటి సారిగా మద్దతు తెలియజేసిన ప్రభుత్వం తమదేనని చెప్పుకొచ్చారు. ఈ సంస్కరణల వల్ల ఏడాదికి రూ.8 కోట్లు లోటు అని, అయినా ప్రజా సంక్షేమం కోసం ఈ సంస్కరణలకు తమ ప్రభుత్వం మద్దతు తెలియజేశామని వివరించారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడికి, రాష్ట్రంలో చక్కగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి కార్పోరేటర్‌ ముమ్మనేని ప్రసాద్, గద్దె ప్రసాద్, నూతి శ్రీను, వీరంకి డాంగే కుమారి, గాదిరెడ్డి అమ్ములు, లోకేష్‌ రావు, మాదిరెడ్డి రవి, శ్రీమన్నారాయణ, బూస్, ముమ్మనేని మానస, కంఠంనేనని మానస, కల్పన, జె.హారికతో పాటుగా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.