అమడగూరు: జీఎస్టీ పన్నులు తగ్గింపుపై సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై ట్రాక్టర్ ర్యాలీ,అవగాహన కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి వెంకటరమణాచారి నిర్వహించారు.మండల స్థానిక కేంద్రంలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని బుధవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించినట్లు వెంకటరమణచారి తెలిపారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ…వ్యవసాయ టాక్టర్లు,యంత్ర పరికరాలు,12 రకాల బయో పురుగుల మందులపై గతంలో 12 శాతం ఉన్న జీఎస్టీని 7 శాతం వరకు తగ్గించారని అన్నారు.అలాగే వ్యవసాయ డ్రోన్ లపై గతంలో 18 శాతం ఉన్న జీఎస్టీని 13 శాతం తగ్గించారని తెలియజేశారు.రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అలాగే మండల పరిధిలోని చినగానిపల్లిలో పంచాయతీ కార్యదర్శి నరేంద్ర ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బిజెపి మండల కన్వీనర్ రామిశెట్టి వేమనారాయణ,జిల్లా కార్యవర్గ సభ్యుడు సుబ్బిరెడ్డి,సీనియర్ నాయకులు ఇందుకూరి సురేందర్ రెడ్డి,సొసైటీ డైరెక్టర్ హైదర్ వలి,టిడిపి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డప్ప,నజ్జిరెడ్డి,బిజెపి ఉపాధ్యక్షుడు వెంకటనారాయణ,కార్యవర్గ సభ్యులు గంగులప్ప,ప్రజాప్రతినిధులు,రైతులు,ఏఈఓ రమేష్ నాయక్,ఏపీసియన్ యాఫ్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీ పై రైతులకు అవగాహన ర్యాలీ.