Sunday, 7 December 2025
  • Home  
  • జీఎస్టీ తగ్గింపు పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం: నల్లా పవన్
- ఆంధ్రప్రదేశ్

జీఎస్టీ తగ్గింపు పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం: నల్లా పవన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అనేక రకాలుగా ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నల్లా పవన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం అమలాపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ 2000 వ సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్పేయి జిఎస్టి అమల్లోకి తీసుకు వద్దామని అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కమిటీలు వేసి ఎట్టకేలకు 2017జూలై 1 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశాన్ని ఏకీకృత భారత దేశంగా చేయాలని ఎన్నో కళలుగన్నారని అందులో ఇది కూడా వర్తిస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఈనెల 22 నుంచి అమలు అయ్యేలా వినూత్నంగా ఎక్కువ మొత్తంలో జీఎస్టీ తగ్గించేలా తగ్గింపు చేశారన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు పొందాలంటే చదువుకోవాలని ఉద్దేశంతో వారి చదువుకి ఉపయోగపడే బుక్స్, పెన్స్, పెన్సిల్స్, రబ్బర్లు లాంటి స్టేషనరీ మీద జీరో పర్సెంట్ జీఎస్టీ చేశారన్నారు. ప్రతి వ్యక్తి కూడా ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయడం జరుగుతుందని, వాటి కొనుగోలుపై ప్రతి వాహనంపై 10,000 నుంచి 13,000 వరకు తగ్గించడం జరుగుతుందని, మహిళలు ఇంట్లో వాడే గృహాపకరణాలు అనగా ప్రిడ్జ్, వాషింగ్ మిషన్ లు, మిక్సీలు, గ్రైండర్ ల మీద భారీగా తగ్గించడం జరిగిందని, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన క్యాన్సర్ లాంటి కొన్ని రకాల ప్రాణాంతకమైన జబ్బులకు వాడే మందులు మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ తగ్గించడం జరిగిందని, కొన్ని మందుల మీద 12 శాతం నుంచి 5 శాతానికి పన్ను తగ్గించడం జరిగిందన్నారు. ఆరోగ్య భీమాకు సంబంధించిన పన్నులు కూడా జీరో కి చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ పనిముట్లు మీద 18 నుంచి 5 శాతానికి పన్ను తగ్గించడం జరిగింది, పాలు, పన్నీరు మీద జీరో పర్సన్ టాక్స్ చేయడం జరిగింది అన్నారు. అలాగే ప్రతీ దాని మీద టాక్స్ తగ్గించి ఆత్మ నిర్భర భారత్ అనే దానిని తీసుకుని భారత్లో తయారైన వస్తువులే మన దేశం వాళ్లే కొనాలనే ఉద్దేశంతోనే తీసుకు రావడం జరిగిందని అన్నారు. ఇవన్నీ కూడా కేవలం ప్రకటన వరకే మాత్రమే పరిమితం కాదని సెప్టెంబర్ 22వ తారీకు నుంచి అమల్లోకి వస్తున్నాయని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారని అన్నారు. సందర్భంగా నిర్మల సీతారామన్ కి, ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫునుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు అయ్యల భాషా,పావులూరి వెంకట్,పట్టణ ప్రధాన కార్యదర్శి D V S రాజు ,బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అనేక రకాలుగా ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నల్లా పవన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం అమలాపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ 2000 వ సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్పేయి జిఎస్టి అమల్లోకి తీసుకు వద్దామని అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కమిటీలు వేసి ఎట్టకేలకు 2017జూలై 1 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశాన్ని ఏకీకృత భారత దేశంగా చేయాలని ఎన్నో కళలుగన్నారని అందులో ఇది కూడా వర్తిస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఈనెల 22 నుంచి అమలు అయ్యేలా వినూత్నంగా ఎక్కువ మొత్తంలో జీఎస్టీ తగ్గించేలా తగ్గింపు చేశారన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు పొందాలంటే చదువుకోవాలని ఉద్దేశంతో వారి చదువుకి ఉపయోగపడే బుక్స్, పెన్స్, పెన్సిల్స్, రబ్బర్లు లాంటి స్టేషనరీ మీద జీరో పర్సెంట్ జీఎస్టీ చేశారన్నారు. ప్రతి వ్యక్తి కూడా ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయడం జరుగుతుందని, వాటి కొనుగోలుపై ప్రతి వాహనంపై 10,000 నుంచి 13,000 వరకు తగ్గించడం జరుగుతుందని, మహిళలు ఇంట్లో వాడే గృహాపకరణాలు అనగా ప్రిడ్జ్, వాషింగ్ మిషన్ లు, మిక్సీలు, గ్రైండర్ ల మీద భారీగా తగ్గించడం జరిగిందని, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన క్యాన్సర్ లాంటి కొన్ని రకాల ప్రాణాంతకమైన జబ్బులకు వాడే మందులు మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ తగ్గించడం జరిగిందని, కొన్ని మందుల మీద 12 శాతం నుంచి 5 శాతానికి పన్ను తగ్గించడం జరిగిందన్నారు. ఆరోగ్య భీమాకు సంబంధించిన పన్నులు కూడా జీరో కి చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ పనిముట్లు మీద 18 నుంచి 5 శాతానికి పన్ను తగ్గించడం జరిగింది, పాలు, పన్నీరు మీద జీరో పర్సన్ టాక్స్ చేయడం జరిగింది అన్నారు. అలాగే ప్రతీ దాని మీద టాక్స్ తగ్గించి ఆత్మ నిర్భర భారత్ అనే దానిని తీసుకుని భారత్లో తయారైన వస్తువులే మన దేశం వాళ్లే కొనాలనే ఉద్దేశంతోనే తీసుకు రావడం జరిగిందని అన్నారు. ఇవన్నీ కూడా కేవలం ప్రకటన వరకే మాత్రమే పరిమితం కాదని సెప్టెంబర్ 22వ తారీకు నుంచి అమల్లోకి వస్తున్నాయని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారని అన్నారు. సందర్భంగా నిర్మల సీతారామన్ కి, ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫునుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు అయ్యల భాషా,పావులూరి వెంకట్,
పట్టణ ప్రధాన కార్యదర్శి D V S రాజు ,బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.