*జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ,ఎంవోయూ మార్పిడి*
*విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి*
భారతదేశంలోనే మొట్ట మొదటి జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు సంబంధించిన అంకురార్పణ,ఎంవోయూ మార్పిడి కార్యక్రమం విశాఖ లోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో అట్టహాసంగా జరిగింది ముఖ్య అతిథులుగా గోవా గవర్నర్,మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు,ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు,కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఎం.ఎస్.ఎం.ఈ.,సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్,జీఎంఆర్ రాజు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతి నిధులు మరియు అధి కారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాన్సాస్ ట్రస్ట్, ఈ ప్రతిష్టాత్మక ఏవియేషన్ ఎడ్యుసిటీ కోసం భీమిలి మండలం అన్నవరం గ్రామం లో 136.63 ఎకరాలభూమిని కేటాయించింది.
*కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి మాట్లాడుతూ
ఇది చరిత్రకత్మక దినం ఉత్త రాంధ్ర ఒకప్పుడు వెనుక బడ్డ ప్రాంతం వలసల ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి చెందిన విశాఖగా మార్చారు 18 నెలల్లో చంద్రబాబునాయుడు లోకేష్ పౌర విమానయానం అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగం ఇది అత్యంత ప్రాముఖ్యత కలగడానికి ప్రధాని మోడీ కారణం ప్రతి సం.12శాతం గ్రోత్ రేట్ ఉంది అంటే అప్పటి మంత్రి ఇప్పటి గవర్నర్ అయిన అశోక్ గజపతి రాజు పేజీ కనపడు తుంది 800 ఎయిర్ క్రాఫ్ట్ లు ప్రస్తుతం ఉన్నాయి 1700 ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ 100 రకాలు ఉద్యోగాలు ఉంటాయి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కి అగ్రికల్చర్,ఇన్ఫ్రా,ఏవి యేషన్ తదితర అనేక అంశాలు పై చంద్రబాబు నాయుడుకి పూర్తి అవ గాహన ఉంటుంది రాబోయే 30,40 సం తరవాత ఏమి అవసరం అనే ఆలోచన చేస్తారు నెల రోజుల్లో ట్రయల్స్ జరుగుతాయి భోగా పురంలో జూలై లో భోగా పురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వుంటుంది యూనివర్సిటీ నీ ఎదుసిటీగా మార్చాం ప్రపంచంలో ఏ యూనివర్సిటీ తో అయినా మనం దీనిలో తేవచ్చు వలసలకు మనం వెళ్ళే రోజులు నుండి మన వద్దకు ప్రపంచం వచ్చే విధంగా తీర్చి దిద్దారు చంద్రబాబు నాయుడు
*నారా లోకేష్ కామెంట్స్*
బీహార్ లో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారంకి వెళ్ళాం గడిచిన 18నెలల్లో ఏపీలో ఒక మ్యాజిక్ జరుగుతుంది అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు మెసైల్స్,జి పి ఎస్ రెండు కలిసి పని చేస్తున్నాం తలసరి ఆదాయం తక్కువ ఉంది అని అహర్నిశలు కష్ట పడుతున్నాం అన్ని ఐటీ కంపెనీలు భీమిలికి వస్తున్నాయి జిఎంఆర్ 10వ తరగతి ఫెయిల్ అయ్యారు ఆ తర్వాత మాన్సాస్ లో ఇంటర్ చదివి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ లు కడుతున్నారు సెంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం టైమ్ లో కొంత మంది ఎగతాళి చేశారు ఎయిర్పోర్ట్ కి 5వేల ఎకరాలు అవసరమా అని ఇప్పడు దాని విలువ అర్థం అవు తుంది కొన్ని చోట్ల ఇప్పుడు 2వ ఎయిర్పోర్ట్ నిర్మాణం కి ట్రై చేస్తున్నారు సివిల్ ఏవియేషన్ లో ప్రపంచంలో 25శాతం మన తెలుగు వారు ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన ఒక గజం భూమి కోసం కొట్టు కుంటున్న సమాజంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తున్నారు గజపతి కుటుంబం దీనికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు భూములు నిమిత్తం అంత గొప్ప కుటుంబం గజపతి కుటుంబం
*గంటా శ్రీనివాసరావు బీమిలి ఎమ్మెల్యే కామెంట్స్*
మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పెద్దలు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ సిఈవో శివ ప్రసాద్ రాజు,ఐటీ మంత్రి లోకేష్ కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు ముందు ఉంటారు హైదర బాద్ నగర అభివ్రుద్ది చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది దేశ యావత్తు రాజకీయాలు ఏపీ భవన్ లో ఉండేవి శంషాబాద్ విమానా శ్రయం నిర్మాణంలో ముఖ్య భూమిక చంద్రబాబు నాయుడుది భోగాపురం ఎయిర్ పోర్ట్ ను అను సంధానం చేసుకుంటూ విశ్వ విద్యాలయం ఏర్పాటు చూస్తే చంద్రబాబు నాయుడు విజన్ అర్ధం అవుతుంది ఈ 18 నెలల్లో మొత్తం ఇకో సిస్టమ్ తీసుకొచ్చారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముఖ్య భూమిక పోషిస్తున్న వ్యక్తి లోకేష్ ఒకప్పుడు విమానం లగ్జరీ ఇప్పుడు అవసరం అయింది 12నెలలు అంటే కుదరదు ఒకరోజు ముందే పూర్తి చేయాలి అనే అంత ఆలోచనతో లోకేష్ పని చేస్తున్నారు
*గోవా గవర్నర్,మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు కామెంట్స్*
ఉత్తరాంధ్ర విద్యార్ధులకు మంచి విద్యా మా ట్రస్ట్ నుండి ఇస్తున్నాం మన ప్రాంతానికి ఒక నైపుణ్యం కలిగిన ఎడ్యు కేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు దీనిపై అతి ఎక్కువ శ్రద్ధ తీసుకున్న చంద్రబాబు నాయుడు లోకేష్ లకి ప్రత్యేక ధన్యవాదములు
*అయ్యన్న పాత్రుడు స్పీకర్ కామెంట్స్*
1983లో రాజకీయాలు లోకి వచ్చాను అప్పటి నుండి చూస్తున్న ఇప్పుడు ఉత్త రాంధ్రకీ మహర్దశ వచ్చింది ఉత్తరాంధ్రకీ ఎన్ టి రామా రావు ఒక గుర్తింపు తెచ్చారు ఇప్పుడు చంద్ర బాబు, లోకేష్ మమ్మల్ని నిద్ర పోవడం లేదు రాష్ట్ర అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం పని చేస్తుంది ఇంతలా పని చేస్తున్న కూడా ఇంకా అడ్డంకులు సృష్టి స్తున్నారు పార్టీలు ఉంటాయి కానీ మంచి కార్యక్రమంకి ప్రోత్సాహం ఉండాలి జీఎంఆర్ మల్లికార్జున ఢిల్లీ లో ఒకమాట అన్నారు నా ప్రాంతంలో నాకు ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం కలిగింది ఏవి యేషన్ యూనివర్సిటీ కి భూములు ఇచ్చిన ఘనత అశోక్ గజపతి రాజుది ఇప్పటి రోజుల్లో 10వేలు డొనేషన్ చేసి లక్ష రూపాయల ప్రచారం చేసుకుంటున్నారు వేల కోట్లు రూపాయలు విలువ చేసే భూములు ఆస్తులు ప్రజలకి ఇచ్చేసి సామాన్య జీవితం గడుపు తున్న వ్యక్తి అశోక్ గజపతి రాజు పెద్ద పెద్ద ప్రాచీన్యత పొందిన వ్యక్తులు అనేక మంది ఈ మాన్సాస్ నుండి వచ్చినవారే


