పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) జనవరి 05 : జిహెచ్ఎంసి , జడ్పిటిసి , ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు జిహెచ్ఎంసి లో కలిసిన డివిజన్లు, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో జడ్పిటిసి , ఎంపీటీసీ లకు బరిలో నిలిచే నాయకులు తమ పేర్లను తుక్కుగూడ కార్యాలయంలో ఇవ్వాలని కోరారు.సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన నాయకులు తమ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని కె ఎల్ ఆర్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల విజయంలో సర్పంచులదే కీలక పాత్ర ఉంటుందన్నారు. కొత్త ఏడాది సందర్భంగా కలిసిన నాయకులతో ప్రత్యేకంగా చర్చించారు. రిజర్వేషన్ల ప్రకారం బీసీ, ఎస్సీ , ఎస్టీ, జనరల్ అభ్యర్థులు పేర్లు ఇవ్వాలని లక్ష్మారెడ్డి సూచించారు. ఎన్నికల్లో పని చేసే యువకులు, పార్టీ నేతలను ఇన్ఛార్జులుగా పంపిస్తామని అన్ని ఎన్నికల్లో విజయం సాధించే నాయకులను ఎంపిక చేయాలని మండల, డివిజన్ లీడర్లకు కె ఎల్ ఆర్ సూచించారు.ఈ కార్యక్రమంలో నూతన సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, మహిళ నాయకురాళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.



