జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 111 వినతులు.
– నగర మేయర్ పీలా శ్రీనివాసరావు
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-*: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 111 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం లోని పాత సమావేశ మందిరం లో జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 111 అర్జీలు/ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా 2వ జోన్ కు 18, 3వ జోన్ కు 16, 4వ జోన్ కు 09, 5వ జోన్ కు 11, 6వ జోనుకు 15, 8వ జోన్ కు 11, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 31 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 13, రెవెన్యూ విభాగమునకు 13, ప్రజారోగ్య విభాగమునకు 07, పట్టణ ప్రణాళిక విభాగమునకు 48, ఇంజినీరింగు విభాగమునకు 21, మొక్కల విభాగమునకు 05, యుసిడి విభాగమునకు 04 కలిపి మొత్తంగా 111 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
అనంతరం కమిషనరు వీడియో కాన్పరెన్స్ ద్వారా జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులతో మాట్లాడుతూ జివిఎంసి పి.జి.ఆర్.ఎస్ లో అన్ని విభాగాలలో ప్రతివారం నమోదు చేసిన ఫిర్యాదులే తిరిగి నమోదు అవుతున్నాయని, అధికారులు స్వయంగా పి.జి.ఆర్.ఎస్ అర్జీదారులతో సంప్రదించి సమస్యలను పరిష్కరించాలనన్నారు. పట్టణ ప్రణాళికా విభాగం లో ఎక్కువగా పిర్యాదులు నమోదు అవుతున్నాయని, అధికారులు పి.జి.ఆర్.ఎస్ పై ప్రత్యేక దృష్టి సారించాలనన్నారు. ప్రభుత్వం ప్రజలు సౌలభ్యం కోసమే పురమిత్ర యాప్ ను ప్రవేశపెట్టిందని, ప్రజలకు పురమిత్ర యాప్ డౌన్ లోడ్ చేసుకొనేవిధంగా అవగాహన పరచాలని, పురమిత్ర యాప్ లో ప్రజలు సమస్యలు నమోదు చేసుకోవడం ద్వారా వారి సమస్యలు పరిష్కారం మవుతాయని తెలియజేయాలని సచివాలయ కార్యదర్శిల ద్వారా ప్రజలకు అవగాహణ పరిచేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లకు ఆదేశించారు. తద్వారా వారు నేరుగా పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమానికి వచ్చి సమస్యలు తెలియజేసే శ్రమను వారికి తగ్గుతుందని అవగాహన పరచాలని కమిషనరు తెలిపారు. జివిఎంసి ప్రధాన కార్యాలయం సిటీ ఆఫరేషన్ సెంటర్ కు టోల్ ఫ్రీ నెం.180042500009 కు ఫోన్ ద్వారా, అలాగే అన్ని పని దినాలలో ఉ.గం.10.30 ని.ల నుండి సా.గం.5.00 ల వరకు జివిఎంసి ప్రధాన కార్యాలయం ప్రంగణం పిర్యాదుల కేఁద్రం లో ప్రజలు ఫిర్యాదులు, వినతి పత్రాలు సమర్పించవచ్చునని ప్రజలకు తెలియజేయాలని కమిషనరు తెలిపారు.
ఈ సమావేశంలో జీవీఎంసీ ప్రధాన ఇంజినీరు పి.వి.వి.సత్యనారాయణరాజు, అదనపు కమీషనర్ డి.వి.రమణ మూర్తి, సిసిపి ఎ.ప్రభాకారరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి.నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవరెడ్డి, సెక్రటరీ బి.వి.రమణ, డిసిఆర్ ఎస్.శ్రీనివాసరావు, డిడిహెచ్ ఎం.దామోదరరావు, పర్యవేక్షక ఇంజనీర్లు పల్లమరాజు, గోవింద రావు, ఏడకొండలు, కె.శ్రీనివాసరావు, గోవిందరావు, సంపత్ కుమార్, శాంతిరాజ్, బయోలజిస్ట్ సాంబమూర్తి, స్పోర్ట్ డైరెక్టర్ ఇ.ఎ.రాజు, ఆర్.ఎఫ్.ఒ హనుమంతురావు, డిసిపిలు హరిదాసు, రామమోహన్, ఎసిపి లు, యుసిడి పి.ఒ ప్రేమ ప్రసాన్న వాణి, డిపిఒ శాంతి కుమారి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు

