Sunday, 7 December 2025
  • Home  
  • జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 137 వినతులు.
- విశాఖపట్నం

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 137 వినతులు.

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 137 వినతులు. – నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 137 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం లోని పాత సమావేశ మందిరం లో జివిఎంసి అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 137 అర్జీలు/ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా 1వ జోన్ కు 01, 2వ జోన్ కు 20, 3వ జోన్ కు 16, 4వ జోన్ కు 25, 5వ జోన్ కు 17, 6వ జోనుకు 34, 7వ జోనుకు 02, 8వ జోన్ కు 16, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 06 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 07, రెవెన్యూ విభాగమునకు 13, ప్రజారోగ్య విభాగమునకు 08, పట్టణ ప్రణాళిక విభాగమునకు 58, ఇంజినీరింగు విభాగమునకు 26, మొక్కల విభాగమునకు 07, యుసిడి విభాగమునకు 18 కలిపి మొత్తంగా 137 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అనంతరం అదనపు కమిషనరు మాట్లాడుతూ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ ఫిర్యాదులను అదే రోజు వెంటనే పరిశీలిస్తూ, సంబంధిత ఫిర్యాదు దారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని జివిఎంసి అధికారులను, జోనల్ కమీషనర్లను అదనపు కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, ఫైనాన్సర్ అడ్వైజర్ మల్లికాంబ, సిసిపి ఏ.ప్రభాకర రావు, పర్యవేక్షక ఇంజనీర్లు కె.శ్రీనివాసరావు, సంపత్ కుమార్, ఏడుకొండలు, డిసిఆర్ ఎస్.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు ఎమ్.ఆర్.ఎస్ అప్పారావు, పిఒ-యుసిడి పి.ప్రసన్నవాణి, డిపిఓ శాంతి కుమారి, డీసీపీలు హరిదాసు, రామమోహనరావు, ఏసీపీ లు, సివిఒ డా.రవికుమార్, స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు, ఆర్.ఎఫ్.ఒ కృపావర్మ తదితరులు పాల్గొన్నారు.

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 137 వినతులు.
– నగర మేయర్ పీలా శ్రీనివాసరావు.

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 137 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం లోని పాత సమావేశ మందిరం లో జివిఎంసి అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 137 అర్జీలు/ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా 1వ జోన్ కు 01, 2వ జోన్ కు 20, 3వ జోన్ కు 16, 4వ జోన్ కు 25, 5వ జోన్ కు 17, 6వ జోనుకు 34, 7వ జోనుకు 02, 8వ జోన్ కు 16, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 06 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 07, రెవెన్యూ విభాగమునకు 13, ప్రజారోగ్య విభాగమునకు 08, పట్టణ ప్రణాళిక విభాగమునకు 58, ఇంజినీరింగు విభాగమునకు 26, మొక్కల విభాగమునకు 07, యుసిడి విభాగమునకు 18 కలిపి మొత్తంగా 137 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.

అనంతరం అదనపు కమిషనరు మాట్లాడుతూ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ ఫిర్యాదులను అదే రోజు వెంటనే పరిశీలిస్తూ, సంబంధిత ఫిర్యాదు దారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని జివిఎంసి అధికారులను, జోనల్ కమీషనర్లను అదనపు కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, ఫైనాన్సర్ అడ్వైజర్ మల్లికాంబ, సిసిపి ఏ.ప్రభాకర రావు, పర్యవేక్షక ఇంజనీర్లు కె.శ్రీనివాసరావు, సంపత్ కుమార్, ఏడుకొండలు, డిసిఆర్ ఎస్.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు ఎమ్.ఆర్.ఎస్ అప్పారావు, పిఒ-యుసిడి పి.ప్రసన్నవాణి, డిపిఓ శాంతి కుమారి, డీసీపీలు హరిదాసు, రామమోహనరావు, ఏసీపీ లు, సివిఒ డా.రవికుమార్, స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు, ఆర్.ఎఫ్.ఒ కృపావర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.