చిట్వేల్ మండలంలోని అక్షర హై స్కూల్ విద్యార్థి కె. జశ్వంత్ జిల్లా స్థాయి అండర్–17 వాలీబాల్ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఆదివారం నాడు కడపలోని మాంటిస్సోరి జగతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన అండర్–17 బాల, బాలికల వాలీబాల్ పోటీల్లో ఆయన ప్రతిభను ప్రదర్శించారు.
కె. జశ్వంత్ రానున్న రోజుల్లో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జరగనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా అక్షర హై స్కూల్ కరస్పాండెంట్ ఆర్. మల్లికార్జున నాయుడు, ప్రధానోపాధ్యాయిని స్రవంతి మేడం విద్యార్థి ఎంపిక పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జశ్వంత్ భవిష్యత్తులో జాతీయస్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
విద్యార్థిని అభినందిస్తూ పాఠశాల తరఫున ఆయన తల్లిదండ్రుల చేతుల మీదుగా చిరు కానుకతో సత్కరించారు. ఈ విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు పి. సుకుమార్‌ను కూడా ప్రత్యేకంగా అభినందించారు.
చిట్వేల్ అక్షర హై స్కూల్ విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ, “మన చిట్వేల్ నుంచి రాష్ట్రస్థాయికి జశ్వంత్ వెళ్ళడం గర్వకారణం” అని పేర్కొన్నారు.


