నంద్యాల జిల్లా చెస్ సంఘం, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఈపూరి శేషయ్య శెట్టి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జింకా ఆడిటోరియంలో జరిగిన జిల్లా స్థాయి ఓపెన్ చదరంగం పోటీలలో విజేతలకు నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, పారిశ్రామికవేత్త ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో పతకాలు, ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేయడం జరిగింది నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవం లో నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు కోశాధికారి అమిదేల జనార్ధన్ అతిథులుగా పాల్గొని మొదటి పది స్థానాలు సాధించిన వారికి ట్రోఫీలు,నగదు బహుమతులు,వివిధ వయసు కేటగిరీలలో విజేతలకు పతకాలు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ గెలిచినవారు తమ గెలుపు స్థానాన్ని నిలబెట్టుకోవడానికి,విజయం అందుకోని వారు తదుపరి పోటీలలో విజయాలు సాధించడానికి కోచ్ ల పర్యవేక్షణలో నిత్య సాధన ద్వారా క్రీడలలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. ఆ విధమైన అంకితభావం,క్రమశిక్షణ క్రీడాకారులకు చాలా అవసరం అన్నారు ఈ కార్యక్రమంలో చెస్ జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు మేడం చంద్రశేఖర్,టోర్నమెంట్ పర్యవేక్షకులు వెంకటరావు, గెలివి శ్రీకాంత్, సత్య సాయి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మణికంఠ,నేషనల్ ఆర్బిటర్ సుజాత,వ్యాయామ ఉపాధ్యాయులు మాలిక్ భాషా, జస్ట్ కోచ్ శ్రీనివాసులు బహుమతి ప్రధానోత్సవం లో పాల్గొన్నారు నంద్యాల జిల్లా చదరంగం పోటీ విజేతలు:
ఇమామ్ హుసేని ప్రధమ స్థానం,యుగంధర్ ద్వితీయ స్థానం, రిషితా బాయ్ తృతీయ స్థానం సాధించగా, తదుపరి ఆరు స్థానాలు మన్విత్ నాయక్,జానకి రామ రాజు,మోక్షిత్ కుమార్,సాయి కార్తికేయ,శాలెం మణికుమార్,లక్ష్మీ సందీప్,హార్జిత్ వర్మ సాధించి ట్రోఫీలు నగదు బహుమతులు అందుకున్నారు.

జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం
నంద్యాల జిల్లా చెస్ సంఘం, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఈపూరి శేషయ్య శెట్టి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జింకా ఆడిటోరియంలో జరిగిన జిల్లా స్థాయి ఓపెన్ చదరంగం పోటీలలో విజేతలకు నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, పారిశ్రామికవేత్త ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో పతకాలు, ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేయడం జరిగింది నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవం లో నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు కోశాధికారి అమిదేల జనార్ధన్ అతిథులుగా పాల్గొని మొదటి పది స్థానాలు సాధించిన వారికి ట్రోఫీలు,నగదు బహుమతులు,వివిధ వయసు కేటగిరీలలో విజేతలకు పతకాలు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ గెలిచినవారు తమ గెలుపు స్థానాన్ని నిలబెట్టుకోవడానికి,విజయం అందుకోని వారు తదుపరి పోటీలలో విజయాలు సాధించడానికి కోచ్ ల పర్యవేక్షణలో నిత్య సాధన ద్వారా క్రీడలలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. ఆ విధమైన అంకితభావం,క్రమశిక్షణ క్రీడాకారులకు చాలా అవసరం అన్నారు ఈ కార్యక్రమంలో చెస్ జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు మేడం చంద్రశేఖర్,టోర్నమెంట్ పర్యవేక్షకులు వెంకటరావు, గెలివి శ్రీకాంత్, సత్య సాయి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మణికంఠ,నేషనల్ ఆర్బిటర్ సుజాత,వ్యాయామ ఉపాధ్యాయులు మాలిక్ భాషా, జస్ట్ కోచ్ శ్రీనివాసులు బహుమతి ప్రధానోత్సవం లో పాల్గొన్నారు నంద్యాల జిల్లా చదరంగం పోటీ విజేతలు: ఇమామ్ హుసేని ప్రధమ స్థానం,యుగంధర్ ద్వితీయ స్థానం, రిషితా బాయ్ తృతీయ స్థానం సాధించగా, తదుపరి ఆరు స్థానాలు మన్విత్ నాయక్,జానకి రామ రాజు,మోక్షిత్ కుమార్,సాయి కార్తికేయ,శాలెం మణికుమార్,లక్ష్మీ సందీప్,హార్జిత్ వర్మ సాధించి ట్రోఫీలు నగదు బహుమతులు అందుకున్నారు.

