Tuesday, 24 March 2026
  • Home  
  • జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు – అక్రమ నాటు సారా నిర్మూలన, ఈవ్‌ టీజింగ్ అరికట్టడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
- ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు – అక్రమ నాటు సారా నిర్మూలన, ఈవ్‌ టీజింగ్ అరికట్టడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నర్సీపట్నం సబ్‌ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో, నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ ఆధ్వర్యంలో ఎస్సై రాజారావు తోపాటు పోలీసులు విస్తృతమైన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో, బంగారయ్యపాలెం మరియు బాపిరెడ్డి కొత్తపాలెం గ్రామాల్లో అక్రమ నాటు సారా తయారీ బట్టిలపై దాడులు నిర్వహించి, సుమారు 3,500 లీటర్ల ఎఫ్.జె. వాష్‌ (బెల్లం పులుపు)ను ధ్వంసం చేసి, తయారీకి ఉపయోగించిన వంట పాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, నర్సీపట్నం టౌన్ పోలీసులు ఈవ్‌ టీజింగ్ నివారణ, రోడ్డు ప్రమాదాల అరికట్టడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, ఆర్టీసీ కాంప్లెక్స్ మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో డ్రోన్ సర్విల్లెన్స్ నిర్వహించి, ఆకతాయిలను అదుపులోకి తీసుకొని, రవాణా వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్‌ డివిజన్ డీఎస్పీ .శ్రీనివాసరావు మాట్లాడుతూ:“జిల్లా పోలీసులు మహిళలు, బాలబాలికలకు సంపూర్ణ భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ, అవసరమైన చోట కేసులు నమోదు చేస్తున్నాం” అని తెలిపారు

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నర్సీపట్నం సబ్‌ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో, నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ ఆధ్వర్యంలో ఎస్సై రాజారావు తోపాటు పోలీసులు విస్తృతమైన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు.

ఈ క్రమంలో, బంగారయ్యపాలెం మరియు బాపిరెడ్డి కొత్తపాలెం గ్రామాల్లో అక్రమ నాటు సారా తయారీ బట్టిలపై దాడులు నిర్వహించి, సుమారు 3,500 లీటర్ల ఎఫ్.జె. వాష్‌ (బెల్లం పులుపు)ను ధ్వంసం చేసి, తయారీకి ఉపయోగించిన వంట పాత్రలను స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా, నర్సీపట్నం టౌన్ పోలీసులు ఈవ్‌ టీజింగ్ నివారణ, రోడ్డు ప్రమాదాల అరికట్టడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, ఆర్టీసీ కాంప్లెక్స్ మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో డ్రోన్ సర్విల్లెన్స్ నిర్వహించి, ఆకతాయిలను అదుపులోకి తీసుకొని, రవాణా వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా సబ్‌ డివిజన్ డీఎస్పీ .శ్రీనివాసరావు మాట్లాడుతూ:
“జిల్లా పోలీసులు మహిళలు, బాలబాలికలకు సంపూర్ణ భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ, అవసరమైన చోట కేసులు నమోదు చేస్తున్నాం” అని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.