నెల్లూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీస్ఆ దేశాల మేరకు, అడిషనల్ యస్.పి. (అడ్మిన్) సూచనలతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దీర్ఘకాలం వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు అలసటకు గురికాకుండా ఉండేందుకు, చెక్‌పోస్టుల వద్ద వారిని ఆపి ముఖం కడుక్కోవడం, విశ్రాంతి తీసుకోవడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



