జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులను మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్.టి.ఎ రాష్ట్ర, జిల్లా నాయకులు
నూతన ఆంగ్ల సంవత్సరం… 2026 ప్రారంభం సందర్భంగా గురువారం నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా చిత్తూరు ఏంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, చిత్తూరు ఎం.ఎల్.ఎ గురజాల జగన్ మోహన్ నాయుడు,ఆయన తండ్రి చెన్న కేశవులు నాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్, డీ.ఈ.ఓ రాజేంద్ర ప్రసాద్ లను కలసి పుష్పగుచ్ఛాలు అందించి దుషాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.తమకు వినతులు రూపంలో అందించే ఉపాధ్యాయులు సమస్యలు పట్ల సత్వరం పరిష్కoపజేయడానికి తాము సిద్ధంగా వున్నట్లు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు.ఈ పాటికే ఉపాద్యాయుల పలు సమస్యలు సాధనలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అగ్రభాగాన నిలిచిందని ప్రజాప్రతినిధులు ఎన్.టి.ఎ.నాయకులను ప్రశంసించారు. అదేవిధంగా నూతన సంవత్సరం క్యాలెండర్,డైరీలు, టేబుల్ క్యాలెండర్ లు ఎంపీ, ఎం.ఎల్.ఏ లు చేతుల మీదుగా ఆవిష్కరింప జేశారు. కార్యక్రమంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్, కార్యదర్శి రాజేశ్వర కుమార్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి చందనం రామయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఏ.ఆర్.కుమార్, జిల్లా ఫైనాన్స్ కార్యదర్శి బాబు రెడ్డి, జిల్లా కార్యదర్శి రుక్మాంగద, కుప్పం డివిజన్ కన్వీనర్ శ్రీరాములు, చిత్తూరు నగరం అధ్యక్షురాలు దేవకి తదితరులు పాల్గొన్నారు.


