నెల్లూరు , డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో జిల్లా పరిషత్ ,మండల పరిషత్ ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులు 17 మందికి జూనియర్ సహాయకులు మరియు టైపిస్టులకు సీనియర్ సహాయకులుగా పదోన్నతి లభించింది పై పదోన్నతి ఉత్తర్వులు జడ్పీ చైర్ పర్సన్ గారు గౌరవనీయులు శ్రీమతి ఆనం అరుణమ్మ గారు జెడ్పీ సీఈవో గౌరవనీయులు శ్రీ ఎల్ శ్రీధర్ రెడ్డి గారు జడ్పీ డిప్యూటీ సీఈవో గౌరవనీయులు శ్రీ జే మోహన్ రావు గారు చేతుల మీదగా పదోన్నతి ఉత్తర్వులు అందజేసినారు పై పదోన్నతి ఉత్తర్వులు సహకరించిన జడ్పీ చైర్మన్ గారికి సీఈఓ గారికి డిప్యూటీ సీఈఓ గారికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అయిన శ్రీ లక్కాకుల పెంచలయ్య శ్రీ వి దేవ ప్రసన్నకుమార్ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు


