నందలూరు మండలంలో గతంలో నడిచిన (ఆర్,ఎస్) రూట్ బస్సు సేవలు నిలిపివేయడంతో స్థానిక ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నందలూరు ప్రాంత ప్రజల సమస్యలను గుర్తించిన స్థానిక బీజేపీ పార్టీ నాయకులు రాచూరి మురళి,వీరబల్లి జయ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్, హ్యూమన్ రైట్స్ ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు,జనం న్యూస్ విలేఖరి కిరణ్ కలిసి ఈ బస్సు సేవలను తిరిగి పునరుద్ధరించాలని బీజేపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ ని కోరారు.
వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సాయి లోకేష్ వెంటనే ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రాన్ని స్వీకరించిన రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవి లత సమస్యపై స్పందిస్తూ, టంగుటూరు–రాజంపేట రూట్ బస్సును నందలూరు ఆర్‌ఎస్ రోడ్డు మీదుగా నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచనలు జారీ చేశారు.
దీంతో ప్రజలకు, ఉద్యోగస్తులకు, ముఖ్యంగా రాజంపేటలో విద్యనభ్యసిస్తున్న కాలేజీ మరియు స్కూల్ విద్యార్థులకు ఈ బస్సు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఉదయం 8 గంటల సమయంలో నందలూరు ఆర్,ఎస్ రోడ్డు ఆర్,అండ్,బి బంగ్లా వద్ద ఈ బస్సు రాజంపేటకు ప్రయాణించే వారికి అందుబాటులో ఉంటుందని ఎన్డీఏ నాయకులు తెలిపారు.
ఈరోజు ఉదయం 8 గంటలకు అరవపల్లి ఆర్,అండ్,బి బంగ్లా వద్ద చేరుకున్న బస్సు, బస్సు డైవరు మరియు కండక్టర్ ను ప్రజా ప్రతినిధులు మిఠాయి పంచి శాలువాతో సత్కరించారు.
నందలూరు ప్రజల చిరకాల సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ కి స్థానిక నాయకులు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయంతో నందలూరు మండల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ వినతికి స్పందించిన ఆర్టీసీ – నందలూరుకు మళ్లీ ఆర్‌ఎస్ రూట్ బస్సు సౌకర్యం
నందలూరు మండలంలో గతంలో నడిచిన (ఆర్,ఎస్) రూట్ బస్సు సేవలు నిలిపివేయడంతో స్థానిక ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నందలూరు ప్రాంత ప్రజల సమస్యలను గుర్తించిన స్థానిక బీజేపీ పార్టీ నాయకులు రాచూరి మురళి,వీరబల్లి జయ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్, హ్యూమన్ రైట్స్ ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు,జనం న్యూస్ విలేఖరి కిరణ్ కలిసి ఈ బస్సు సేవలను తిరిగి పునరుద్ధరించాలని బీజేపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ ని కోరారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సాయి లోకేష్ వెంటనే ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రాన్ని స్వీకరించిన రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవి లత సమస్యపై స్పందిస్తూ, టంగుటూరు–రాజంపేట రూట్ బస్సును నందలూరు ఆర్‌ఎస్ రోడ్డు మీదుగా నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచనలు జారీ చేశారు. దీంతో ప్రజలకు, ఉద్యోగస్తులకు, ముఖ్యంగా రాజంపేటలో విద్యనభ్యసిస్తున్న కాలేజీ మరియు స్కూల్ విద్యార్థులకు ఈ బస్సు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఉదయం 8 గంటల సమయంలో నందలూరు ఆర్,ఎస్ రోడ్డు ఆర్,అండ్,బి బంగ్లా వద్ద ఈ బస్సు రాజంపేటకు ప్రయాణించే వారికి అందుబాటులో ఉంటుందని ఎన్డీఏ నాయకులు తెలిపారు. ఈరోజు ఉదయం 8 గంటలకు అరవపల్లి ఆర్,అండ్,బి బంగ్లా వద్ద చేరుకున్న బస్సు, బస్సు డైవరు మరియు కండక్టర్ ను ప్రజా ప్రతినిధులు మిఠాయి పంచి శాలువాతో సత్కరించారు. నందలూరు ప్రజల చిరకాల సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ కి స్థానిక నాయకులు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయంతో నందలూరు మండల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

