సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఔన్నత్యము
————————————–
జనగామ, అక్టోబర్23,పున్నమి న్యూస్:
జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జనగామలో ఈరోజు విద్యార్థులకు వివిధ రకాల బోధన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీమతి గోలి మాళవిక గారు ఆమె కూతురు నైరా పుట్టినరోజు సందర్భంగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల విద్యార్థులకు వివిధ రకాల భోధనా అభ్యసన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు పేద పిల్లల కోసం, వారిలో చదువు నాణ్యత కోసం ప్రోత్సాహం కల్పించడం సంతోషకరమన్నారు. మాళవిక గారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేసిన మెటీరియల్ పిల్లలకు ప్లేవే మెథడ్ తో పాటు బోధనా అభ్యసన ప్రక్రియలో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాళవిక గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల సమక్షంలో మా పాప జన్మదినాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, విద్యార్థులకు సహాయం చేసే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులకు వివిధ రకాల బోధనాభ్యాసన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె సోదరుడు హరీష్, ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, చాడ రవి, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అమతుల్ ఆలియా, అన్నపూర్ణ, హిమబిందు, భగవాన్ రెడ్డి, నరసింహులు,షఫీ అహమ్మద్, శ్రీనివాస్, రహత్ సుల్తానా, పర్వీన్, తాజద్దీన్, శాంతి, శాంతా, రాజేశ్వర్, ఫ్లోరి ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థులకు ఉచిత బోధనా సామాగ్రి :శంకర్ రెడ్డి ,ఎంఈఓ
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఔన్నత్యము ————————————– జనగామ, అక్టోబర్23,పున్నమి న్యూస్: జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జనగామలో ఈరోజు విద్యార్థులకు వివిధ రకాల బోధన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీమతి గోలి మాళవిక గారు ఆమె కూతురు నైరా పుట్టినరోజు సందర్భంగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల విద్యార్థులకు వివిధ రకాల భోధనా అభ్యసన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు పేద పిల్లల కోసం, వారిలో చదువు నాణ్యత కోసం ప్రోత్సాహం కల్పించడం సంతోషకరమన్నారు. మాళవిక గారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేసిన మెటీరియల్ పిల్లలకు ప్లేవే మెథడ్ తో పాటు బోధనా అభ్యసన ప్రక్రియలో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాళవిక గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల సమక్షంలో మా పాప జన్మదినాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, విద్యార్థులకు సహాయం చేసే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులకు వివిధ రకాల బోధనాభ్యాసన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె సోదరుడు హరీష్, ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, చాడ రవి, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అమతుల్ ఆలియా, అన్నపూర్ణ, హిమబిందు, భగవాన్ రెడ్డి, నరసింహులు,షఫీ అహమ్మద్, శ్రీనివాస్, రహత్ సుల్తానా, పర్వీన్, తాజద్దీన్, శాంతి, శాంతా, రాజేశ్వర్, ఫ్లోరి ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు.

