జగ్గయ్యపేట మండలంలోని గౌరవరం జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మంగళవారం నాడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని నందిగామ శక్తి టీం ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసరావు, హనుమయ్యలు సమన్వయపరిచారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్”, సైబర్ క్రైమ్, మరియు “పోక్సో చట్టం”లపై అవగాహన కల్పించారు. యువత ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో స్పష్టంగా వివరించారు. అదేవిధంగా, “నో హెల్మెట్ – నో డ్రైవింగ్”, “నో లైసెన్స్ – నో డ్రైవింగ్” వంటి రోడ్ సెఫ్టీ అంశాలపై కూడా సూచనలు ఇచ్చారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా నందిగామ ఏసీపీ తిలక్, జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర రావు, ఎస్ఐలు శ్రీనివాసరావు, హనుమయ్యలతో పాటు పలువురు పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన తరగతులు
జగ్గయ్యపేట మండలంలోని గౌరవరం జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మంగళవారం నాడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని నందిగామ శక్తి టీం ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసరావు, హనుమయ్యలు సమన్వయపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులకు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్”, సైబర్ క్రైమ్, మరియు “పోక్సో చట్టం”లపై అవగాహన కల్పించారు. యువత ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో స్పష్టంగా వివరించారు. అదేవిధంగా, “నో హెల్మెట్ – నో డ్రైవింగ్”, “నో లైసెన్స్ – నో డ్రైవింగ్” వంటి రోడ్ సెఫ్టీ అంశాలపై కూడా సూచనలు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా నందిగామ ఏసీపీ తిలక్, జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర రావు, ఎస్ఐలు శ్రీనివాసరావు, హనుమయ్యలతో పాటు పలువురు పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

