జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం శుభ్రం చేస్తున్న సర్పంచ్ ఎంపీటీసీ
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు మండలం స్థానిక అనంతరాజుపేటలోని
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానంలో పిచ్చి మొక్కలు శుభ్రం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న సర్పంచ్ సుబ్రమణ్యం , ఎంపీటీసీ బండారు మల్లికార్జున ప్రారంభం చేశారు .
సువిశాలమైన స్థలంలో ఉన్న పిచ్చి మొక్కలు శుభ్రం చేయడానికి ట్రాక్టర్ డోజర్ ను రప్పించి పనులు పూర్తి చేయాలని కోరారు .
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లలిత కుమారి తెలుగు మాస్టర్ ,సుబ్రమణ్యం రెడ్డి, నాగేంద్ర, రత్నం ,శరత్ కుమార్ ,పిడి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


