* *ప్రభుత్వ పాఠశాలల తనిఖీ విభాగంతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని*
*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 24/01/2026*
*గత పది రోజులుగా వనపర్తి జిల్లాలోని ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాలల జిల్లా తనిఖీ విభాగం సభ్యులతో వనపర్తి జిల్లా విద్యాధికారి అబ్దుల్ గని గారు ఈరోజు సాయంత్రం తమ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది, ఇందులో టీం లీడర్ మరియు సభ్యులు తమ తమ తనిఖీల్లో చూసిన అంశాలు వివిధ పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న వినూత్న బోధనా పద్ధతులను మధ్యాహ్న భోజన పథకాలు డిజిటల్ మరియు ఎఫ్ ఎల్ ఎన్ పానెల్ వివిధ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విద్యా సంబంధమైన యాప్ లతో సరళతరంగా సులభతరంగా విద్యార్థులకు బోధిస్తున్నారని, ఈ ప్రక్రియ ఇలాగే భవిష్యత్తులో కొనసాగించాలని అప్పుడే ప్రభుత్వ పాఠశాలల పై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా బోధనల్లో తమతమ శైలిలో బోధన అభ్యసన ప్రక్రియలను తరగతి గదిలో బోధించాలని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తో ఆకట్టుకునే విధంగా వివిధ ఆక్టివిటీస్ బేస్ పద్ధతుల్లో బోధించాలని వారు తనిఖీ విభాగ టీం లీడర్ మరియు సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గణేష్, చంద్రశేఖర్, ఆనంద్, అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ మహానంది, ప్రతాపరెడ్డి, వివిధ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు టీం సభ్యులు శ్రీనివాసులు, వేణుగోపాల్ రెడ్డి, ఎంఎన్ విజయకుమార్, కబీర్, రవి, లక్ష్మీదేవి, నరసింహ, కే మధుసూదన్, కృష్ణ ,కురుమూర్తి, తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు*


