నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ శ్రీమతి మేకపాటి శాంతకుమారిని ఈ రోజు రేబాల వీధిలోని కేంద్ర గ్రంథాలయంలో
ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పడిన గ్రంథాలయ పునర్వికాస వేదిక, నెల్లూరు జిల్లా కన్వీనర్, అంతర్జాతీయకవి
డాక్టర్ పెరుగు రామకృష్ణ కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పునర్వికాస వేదిక
పిల్లలలో పఠనాశక్తి పెంపొందించే విధంగా పుస్తకాలు తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని, గ్రంథాలయాల బలోపేతానికి తమ వంతు సహకారం అందిస్తున్నామని చెప్పారు. చిల్డ్రన్ పార్క్ లాంటి ప్రాంతాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
రచయితలు స్వయంగా ప్రచురించుకున్న పుస్తకాలు కొనుగోలు చేయడం ద్వారా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.
జిల్లా రచయిత లందరి పక్షాన సంస్థ అధినేతకు అభినందనలు తెలిపారు…!

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు శుభాకాంక్షలు
నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ శ్రీమతి మేకపాటి శాంతకుమారిని ఈ రోజు రేబాల వీధిలోని కేంద్ర గ్రంథాలయంలో ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పడిన గ్రంథాలయ పునర్వికాస వేదిక, నెల్లూరు జిల్లా కన్వీనర్, అంతర్జాతీయకవి డాక్టర్ పెరుగు రామకృష్ణ కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పునర్వికాస వేదిక పిల్లలలో పఠనాశక్తి పెంపొందించే విధంగా పుస్తకాలు తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని, గ్రంథాలయాల బలోపేతానికి తమ వంతు సహకారం అందిస్తున్నామని చెప్పారు. చిల్డ్రన్ పార్క్ లాంటి ప్రాంతాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రచయితలు స్వయంగా ప్రచురించుకున్న పుస్తకాలు కొనుగోలు చేయడం ద్వారా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. జిల్లా రచయిత లందరి పక్షాన సంస్థ అధినేతకు అభినందనలు తెలిపారు…!

