విశాఖపట్నం, జనవరి(పున్నమి ప్రతినిధి):
జిల్లా కేంద్ర గ్రంథాలయం, విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సభ్యులు శ్రీ రౌతు రామమూర్తి గారు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన, సిబ్బందితో పాటు గ్రంథాలయానికి విచ్చేసిన పాఠకులతో మాట్లాడి గ్రంథాలయ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం గ్రంథాలయ ప్రాంగణం, స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి శ్రీ బుర్రి కుమార్ రాజు, డిప్యూటీ లైబ్రేరియన్ జి. తిరుమల కుమారి, ఇన్‌చార్జి అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎల్. రాజేంద్ర వర్మ పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయ సిబ్బంది జి. పైడి రాజు (జూనియర్ అసిస్టెంట్), కె. అరుణకుమారి, గ్రంథాలయ కమిటీ సభ్యులు శ్రీ బి.ఎల్. నారాయణ రావు, పి. మల్లేశ్వర రావు, అలాగే గ్రంథాలయ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కూడా హాజరయ్యారు.
Uploaded Video:


