*నాకు ఎదురైనా ఓటమి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రానివ్వను*
*(కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ గారు)*
కొమురం భీమ్ ఆసిఫాబాద్ 12 అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
*ఈరోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రo లోని రోజ్‌గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేషo లో AICC పరిశీలుకులు డాక్టర్ అనిల్ కుమార్ గారు PCC పరిశిలకులు పులి అనిల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హజరై సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ గారు మాట్లాడుతూ ఆసిఫాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు జిల్లా కార్యవర్గం సరిగ్గా లేక గత MLA ఎన్నికల్లో సరైన సమన్వయం ఓటమిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు కానీ స్థానిక ఎంపీటీసీ జెడ్‌పీటీసీ ఎన్నికల్లో ఆ పొరపాటు మళ్ళీ పునరావతం కాకుండా తక్షణ చర్యలు తీసుకుంటూ జిల్లా కమిటీ ఎన్నిక జరిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అన్ని సీట్లను కైవసం చేసుకునేలా మనం ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలధి అని అన్నారు ఈ కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా MLC గౌ. శ్రీ. దండే విఠల్ గారు Dcc విశ్వప్రసాద్ గారు అన్ని విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫాబాద్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులు తధితరులు పాల్గొన్నారు*


