ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏఐసీసీ చేపట్టిన “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమం నేపథ్యంలో, జిల్లాలో సంస్ధాగత బలోపేతానికి చేపట్టిన చర్యలలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి అత్తింజేరి శ్రీనాథ్ ఇవాళ తన దరఖాస్తును సమర్పించారు. రాజంపేటకు వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్ కే. మహేంద్రన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఈ దరఖాస్తును అందజేశారు.ఈ సందర్భంగా పిసీసీ కార్యవర్గ సభ్యులు అత్తింజేరి శ్రీనాథ్ మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ కోసం గత ఎన్నాళ్లుగానో నిరంతర కృషితో,నిబద్ధతతో పనిచేసిన అనుభవాన్ని వివరించారు.గ్రామ,వార్డు, బూత్ స్థాయిల్లో కాంగ్రెస్ కార్యకర్తలను చైతన్యపరచడం,యువతను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చే దిశగా పనిచేస్తానని తెలిపారు.ప్రజల సమస్యలు, సంక్షేమ అంశాలపై తరచూ వినతిపత్రాలు సమర్పించడం, ప్రెస్ మీట్లు నిర్వహించడం, ప్రభుత్వంపై పోరాటాలు చేయడం వంటి చర్యలతో పార్టీకి ప్రజల్లో తిరిగి నమ్మకం తెచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మళ్లీ బలోపేతం చేయడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు చెప్పారు.మహిళలు, యువత, అణగారిన వర్గాలు, సీనియర్ నాయకులు అంతా కలిసి ముందుకు సాగేలా సమన్వయం చేయడం తన ప్రధాన లక్ష్యమని శ్రీనాథ్ వెల్లడించారు.గతంలో పార్టీ పటిష్టంగా నిలబడిన రోజుల్లో పనిచేసిన కార్యకర్తలను తిరిగి ఒకే వేదికపైకి తీసుకురావడం, బూత్ కమిటీలను పునర్నిర్మించడం,గ్రామ స్థాయిలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా శ్రమిస్తానని పేర్కొన్నారు.చివరిగా, “కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తాను. అయితే జిల్లా కాంగ్రెస్ పునర్నిర్మాణానికి నా సేవలను వినియోగించే అవకాశాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను” అని అత్తింజేరి శ్రీనాథ్ వినయపూర్వకంగా కోరారు. బి

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అత్తింజేరి శ్రీనాథ్ దరఖాస్తు