రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తొలిసారిగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టిడిపి నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ కస్తూరిబా స్కూల్‌ను తనిఖీ చేసి విద్యార్థుల అవసరాలను తెలుసుకున్నారు. రైతులతో భేటీ అవుతూ వ్యవసాయ సమస్యలపై సమీక్షించారు. రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించి మెరుగుదల చర్యలను సూచించారు. కోడూరు–చిట్వేల్ డబుల్ రోడ్డు పనుల పురోగతిని సమీక్షించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.



1 Comment
dhanunjay
October 15, 2025first comment