*జిల్లా కలెక్టర్ ఆనంద్ కలిసి నూతనంగా వచ్చినందుకు శుభాకా
అనంతపురం(పున్నమి ప్రతినిధి)
అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు పరిరక్షణ జిల్లా అధ్యక్షుడు హోన్నూరప్ప ఉపాధ్యక్షుడు కోటేగంటి నబి రసూల్ మరియు కమిటీ సభ్యులు
నూతనంగా జిల్లాకు వచ్చిన జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించి అనంతరం కలెక్టర్ శాలువాతో సన్మానించడం జరిగినది అనంతపురం జిల్లాలో సమాచార హక్కు చట్టం పైన పనిచేస్తున్న సంఘం ఉండడం చాలా ఆనందంగా ఉందా అని. నెల్లూరు జిల్లాలో ఎటువంటి సంఘాలు లేవు అని కలెక్టర్ తెలియ చేయడం జరిగింది
కేరళ రాష్ట్రం అందులోనూ అభివృద్ధి చెందిన మల్లాపురం జిల్లా నుండి మా జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉంది దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాగా ప్రసిద్ధిగాంచిన అనంతపురం జిల్లాను కూడా మీ సొంత జిల్లా మాదిరి అభివృద్ధి చేయాలని ఆ వైపుగా మీరు కృషి చేయవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేయడం జరిగింది అందులకు కలెక్టర్ అభినందనలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అంకె రామలింగమయ్య, బి అనంత కుమారి, హుస్సేన్ పీరా,జాయింట్ సెక్రెటరీ మనోజ్ కుమార్, కల్చరల్ సెక్రెటరీ రషీద్, సింగనమల మండలం కన్వీనర్ రాజ కుల్లాయప్ప మరియు కళ్యాణదుర్గం కన్వీనర్ గోవిందరాజులు పాల్గొనడం జరిగింది


