Monday, 30 March 2026
  • Home  
  • జిల్లా కలెక్టర్‌తో కె.కె. చౌదరి భేటీ
- అన్నమయ్య

జిల్లా కలెక్టర్‌తో కె.కె. చౌదరి భేటీ

-టీడీపీ నాయకుల సమస్యలను నిషాంత్ కునుబిలికి వివరించిన రాష్ట్ర ఖాదీ చైర్మన్ చిట్వేల్, నవంబర్ 28: ఎల్లో సింగం ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి శుక్రవారం రాయచోటిలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ముఖ్య నాయకులు, సర్పంచులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. -సమస్యల పరిష్కారానికి వినతి ఈ భేటీలో కె.కె. చౌదరి ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేలి, పెనగలూరు, ఓబులవారిపల్లి మండలాలకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ నిషాంత్ కుమార్ చర్చించారు. ఆయా మండలాల్లోని కొందరు టీడీపీ ముఖ్య నాయకులు, సర్పంచులు ఎదుర్కొంటున్న పరిపాలన సంబంధిత, స్థానిక సమస్యలను ఆయన కలెక్టర్‌కు వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలని కె.కె. చౌదరి కోరారు. కలెక్టర్ నిషాంత్ కుమార్ సమస్యలను సావధానంగా విన్నారని, వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిసింది. ఈ కార్యక్రమంలో కె.కె. చౌదరి పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

-టీడీపీ నాయకుల సమస్యలను నిషాంత్ కునుబిలికి వివరించిన రాష్ట్ర ఖాదీ చైర్మన్

చిట్వేల్, నవంబర్ 28: ఎల్లో సింగం ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి శుక్రవారం రాయచోటిలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ముఖ్య నాయకులు, సర్పంచులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు.

-సమస్యల పరిష్కారానికి వినతి

ఈ భేటీలో కె.కె. చౌదరి ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేలి, పెనగలూరు, ఓబులవారిపల్లి మండలాలకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ నిషాంత్ కుమార్ చర్చించారు. ఆయా మండలాల్లోని కొందరు టీడీపీ ముఖ్య నాయకులు, సర్పంచులు ఎదుర్కొంటున్న పరిపాలన సంబంధిత, స్థానిక సమస్యలను ఆయన కలెక్టర్‌కు వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలని కె.కె. చౌదరి కోరారు. కలెక్టర్ నిషాంత్ కుమార్ సమస్యలను సావధానంగా విన్నారని, వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిసింది. ఈ కార్యక్రమంలో కె.కె. చౌదరి పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.