ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 11 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి).మనుబోలు ఎస్సై శివ రాకేష్‌కు జిల్లా ఎస్పీ డాక్టర్ అజంతా వేజెండ్ల చేతుల మీదుగా అవార్డు లభించింది. నెల్లూరులో నిర్వహించిన క్రైమ్ మీటింగ్‌లో ఈ పురస్కారం అందజేశారు. కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన డబుల్ మర్డర్ కేసులో నిందితులను సకాలంలో గుర్తించడంలో చూపిన ప్రతిభకు, అలాగే పలు దొంగతనం కేసుల్లో బంగారు నగల రికవరీలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు. ఆయన సేవలను అధికారులు ప్రశంసించగా, సహచరులు, స్థానికులు అభినందనలు తెలిపారు.

జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఎస్సై శివ రాకేష్ సత్కారం.